పెండింగ్ ​నీటి బకాయిలపై వడ్డీ, పెనాల్టీ వసూలు

  • రేపటితో ముగియనున్న వాటర్​బోర్డు ఓటీఎస్​ స్కీం

హైదరాబాద్​సిటీ, వెలుగు: వాటర్​బోర్డు అందుబాటులోకి తెచ్చిన వన్ టైమ్ సెటిల్ మెంట్(ఓటీఎస్) స్కీం శనివారంతో ముగియనుంది. 30వ తేదీ వరకు ఈ స్కీంను ఉపయోగించుకుని ఎలాంటి వడ్డీ, ఆలస్య రుసుం లేకుండా పెండింగ్​నల్లా బిల్లులు చెల్లించవచ్చు. డిసెంబర్​1 నుంచి పెండింగ్ బిల్లుల మీద వడ్డీతోపాటు పెనాల్టీ కట్టాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. అక్టోబర్​నెలలో మాత్రమే అందుబాటులో ఉండాల్సిన ఓటీఎస్​స్కీంను ప్రజల విజ్ఞప్తుల మేరకు నవంబరు 30వ తేదీ వరకూ పొడిగించారు. మరోసారి పెంచే అవకాశం లేదని అధికారులు వెల్లడించారు.