ఒకేరోజు నాలుగు విమానాలకు బాంబు బెదిరింపులు

ఒకేరోజు నాలుగు విమానాలకు బాంబు బెదిరింపులు

'మీ విమానాన్ని పేల్చేస్తున్నాం..' అంటూ వస్తున్న బాంబు బెదిరింపు కాల్స్ విమానయాన సంస్థలను బెంబేలెత్తిస్తున్నాయి. మంగళవారం(అక్టోబర్ 15) ఒక్కరోజే నాలుగు భారత విమానాలకు బాంబు బెదిరింపు సందేశాలు వచ్చాయి. ఈ నాలుగింటిలో రెండు ఎయిర్ ఇండియా విమానాలు కాగా.. మరో రెండు స్పైస్‌జెట్, ఆకాశ ఎయిర్. 

ఆ నాలుగు విమానాలు ఇవే

  • IX765: జైపూర్ to బెంగళూరు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్
  • SG116: దర్భంగా to ముంబై స్పైస్‌జెట్ విమానం
  • SG116: సిలిగురి to బెంగళూరు ఆకాశ ఎయిర్
  • AI 127: ఢిల్లీ to చికాగో ఎయిర్ ఇండియా

బాంబు బెదిరింపుల నేపథ్యంలో జైపూర్ నుండి బెంగళూరుకు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానానికి అయోధ్యలో తనిఖీలు నిర్వహించారు. దాంతో, ఈ విమానం ఆలస్యంగా బయలుదేరింది. దర్భంగా నుండి ముంబై వెళ్లాల్సిన స్పైస్‌జెట్ విమానం (SG116), సిలిగురి నుండి బెంగళూరు బయలుదేరిన అకాశ ఎయిర్ (SG116) విమానాలది అదే పరిస్థితి. అలాగే ఢిల్లీ నుంచి చికాగో వెళ్లాల్సిన  ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపులు రావడంతో.. భద్రతా తనిఖీల నిమిత్తం కెనడాకు దారి మళ్లించారు.

బెదిరింపు కాల్స్ వచ్చిన అన్ని సందర్భాల్లోనూ ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు ఏవియేషన్ సెక్యూరిటీ వర్గాలు వెల్లడించాయి. ఈ బెదిరింపుల వెనుక ఉన్న వ్యక్తులను పట్టుకునేందుకు సివిల్ ఏవియేషన్ అధికారులు.. భారత సైబర్-సెక్యూరిటీ ఏజెన్సీలు, పోలీసుల సహాయాన్ని కోరినట్లు అధికారులు తెలిపారు. ఇటీవల కాలంలో ఇటువంటి ఘటనలు పదే పదే వెలుగు చూస్తున్నాయి.