BBL 2024-25 Final: మరికొన్ని గంటల్లో బిగ్ బాష్ లీగ్ ఫైనల్.. లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలంటే..?

BBL 2024-25 Final: మరికొన్ని గంటల్లో బిగ్ బాష్ లీగ్ ఫైనల్.. లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలంటే..?

క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న బిగ్ బాష్ లీగ్ ఫైనల్ కు సమయం దగ్గర పడింది. ఈ టోర్నీలో హోబర్ట్ హరికేన్స్, సిడ్నీ థండర్ టైటిల్ పోరుకు అర్హత సాధించాయి. వార్నర్ కెప్టెన్సీలో సిడ్నీ థండర్.. నాథన్ ఎల్లిస్ సారధ్యంలో హోబర్ట్ హరికేన్స్ సోమవారం (జనవరి 27) టైటిల్ కోసం అమీ తుమీ తేల్చుకోనున్నాయి. భారత కాలమాన ప్రకారం మ్యాచ్ 1:45 నిమిషాలకు జరుగుతుంది. హోబర్ట్‌లోని బెల్లెరివ్ ఓవల్‌లో ఈ మెగా ఫైనల్ కు ఆతిధ్యం ఇస్తుంది. 

క్వాలిఫయర్‌లో హోబర్ట్ హరికేన్స్ 12 పరుగుల తేడాతో సిడ్నీ సిక్సర్‌పై విజయం సాధించి ఫైనల్స్ కు చేరుకుంది. లీగ్ లో అద్భుతంగా ఆడిన హరికేన్స్.. అదే ఫామ్ ను క్వాలిఫయర్‌లో 1 లో కొనసాగించి ఎలాంటి టెన్షన్ లేకుండా ఫైనల్ కు దూసుకెళ్లింది. నేడు జరిగే ఫైనల్ లో గెలిచి తొలిసారి బిగ్ బాష్ లీగ్ టైటిల్ అందుకోవాలని తీవ్రంగా కసరత్తులు చేస్తుంది. మరోవైపు వార్నర్ కెప్టెన్సీలో సిడ్నీ థండర్ అంచనాలకు మించి రాణించింది. నాకౌట్ మ్యాచ్ లో మెల్‌బోర్న్ స్టార్స్ పై.. ఛాలెంజర్ మ్యాచ్ లో సిడ్నీ సిక్సర్‌పై గెలిచి తుంది పోరుకు అర్హత సాధించి రెండో సారి టైటిల్ పై కన్నేసింది. 

లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలంటే..? 

హోబర్ట్ హరికేన్స్, సిడ్నీ థండర్  మధ్య జరగబోయే బిగ్ బాష్ లీగ్ ఫైనల్ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. వెబ్‌సైట్‌లోనూ ఈ మ్యాచ్ లైవ్ చూడొచ్చు. లైవ్ టెలికాస్ట్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో చూడొచ్చు. 

హోబర్ట్ హరికేన్స్ స్క్వాడ్:

మిచెల్ ఓవెన్, కాలేబ్ జ్యువెల్, మాథ్యూ వేడ్(వికెట్ కీపర్), బెన్ మెక్‌డెర్మాట్, టిమ్ డేవిడ్, నిఖిల్ చౌదరి, క్రిస్ జోర్డాన్, నాథన్ ఎల్లిస్(కెప్టెన్), కామెరాన్ గానన్, పీటర్ హాట్జోగ్లో, రిలే మెరెడిత్, ప్యాట్రిక్ డూలీ, జేక్ డోరాన్ వాకిమ్

సిడ్నీ థండర్ స్క్వాడ్:

జాసన్ సంఘా, డేవిడ్ వార్నర్(కెప్టెన్), మాథ్యూ గిల్క్స్, సామ్ బిల్లింగ్స్(వికెట్ కీపర్), హ్యూ వీబ్‌జెన్, క్రిస్ గ్రీన్, జార్జ్ గార్టన్, నాథన్ మెక్‌ఆండ్రూ, టామ్ ఆండ్రూస్, వెస్ అగర్, తన్వీర్ సంఘా, ఆలివర్ డేవిస్, డేనియల్ క్రిస్టియన్, మొహమ్మద్ హస్నైన్