భారత హాకీ జట్టు ఒలింపిక్స్ లో వరుసగా రెండో పతకం దేశానికి అందించింది. గురువారం (ఆగస్ట్ 8) జరిగిన కాంస్య పతక పోరులో 2-1తో స్పెయిన్‌ను ఓడించి కాంస్య పతకాన్ని అందుకుంది. పతకం సాధించినందుకు భారత హాకీ టీంకు కాసుల వర్షం కురుస్తుంది. కాంస్య పతకాన్ని సాధించినందుకు గానూ పురుషుల హాకీ జట్టులోని ప్రతి సభ్యునికి హాకీ ఇండియా రూ. 15 లక్షల నగదు బహుమతిని, సహాయక సిబ్బందికి రూ.7.5 లక్షలతో పాటుగా ప్రకటించింది.
ఒడిశా సిఎం మోహన్ చరణ్ మాంఝీ తన రాష్ట్రానికి చెందిన డిఫెండర్ అమిత్ రోహిదాస్‌కు రూ.4 కోట్ల ప్రత్యేక నగదు బహుమతిని ప్రకటించారు. అలాగే ప్రతి ఆటగాడికి రూ.15 లక్షలు.. సహాయక సిబ్బందికి రూ.10 లక్షలు బహుమతిగా ఇచ్చారు. మరోవైపు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ రాష్ట్రానికి చెందిన జట్టులోని ప్రతి సభ్యునికి రూ. 1 కోటి బహుమతిని ప్రకటించారు. ఇందులో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, వైస్ కెప్టెన్ హార్దిక్ సింగ్, టోక్యో 2020 కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ తదితరులు ఉన్నారు.
గురువారం జరిగిన కాంస్య పతక ప్లేఆఫ్ మ్యాచ్‌లో ఇండియా 2–1తో స్పెయిన్‌ను చిత్తు చేసి మెగా గేమ్స్‌లో దేశానికి నాలుగో పతకం తెచ్చిపెట్టింది. టోర్నీ అసాంతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్న కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ రెండు గోల్స్‌తో డబుల్ ధమాకా మోగించాడు. స్పెయిన్ తరఫున మార్క్ మిరల్లెస్ 18వ నిమిషంలోనే గోల్ చేసి ఆ జట్టును ఆధిక్యంలోకి తీసుకెళ్లగా... హర్మన్ 30, 33 నిమిషాల్లో వెంటవెంటనే రెండు గోల్స్‌తో జట్టును గెలిపించాడు. తన ఆఖరాటలోనూ కీపర్ పీఆర్ శ్రీజేష్ ఇండియా రక్షకుడిగా నిలిచి వరుసగా రెండు ఒలింపిక్ మెడల్స్‌తో కెరీర్‌ను పరిపూర్ణంగా ముగించాడు.
Hockey India announces cash prize for Paris Olympics bronze medal-winning team
— SportsTiger (@The_SportsTiger) August 9, 2024
📷: IOC#Hockey #ParisOlympics2024 #OlympicGames #Olympic2024 #Paris2024 #hockeyindia #Hockey pic.twitter.com/qGzjdToVn1