న్యూఢిల్లీ: వచ్చే కామన్వెల్త్ గేమ్స్ నుంచి బ్యాడ్మింటన్ తదితర ఆటలను తొలగించడంపై ఇండియా లెజెండరీ షట్లర్లు, కోచ్‌లు పుల్లెల గోపీచంద్,విమల్ కుమార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆటల్లో మన దేశ పురోగతిని దెబ్బతీసేలా ఉన్న ఈ నిర్ణయానికి నిరసనగా కామన్వెల్త్ గేమ్స్‌కు ఇండియాను పంపించొద్దని ప్రభుత్వాన్ని కోరారు. ‘ఇన్ని ఆటలను తొలిగించిన తర్వాత ఈ గేమ్స్‌ను కూడా తీసేస్తే మంచిదని నా అభిప్రాయం. సీడబ్ల్యూజీ కంటే ఒలింపిక్స్, ఆసియా గేమ్స్ నిర్వహించడం మేలు. ఈ నిర్ణయంతో సీడబ్ల్యూజీ తన ఆకర్షణను కోల్పోతోంది కాబట్టి గేమ్స్ కోసం మన దేశాన్ని పంపకూడదు’ అని విమల్ పేర్కొన్నాడు.