వన్డేల్లో ముక్కోణపు సిరీస్.. ఈ మాట విని చాలా సంవత్సరాలే అయింది. టీ20 క్రికెట్ ఎక్కువైన తర్వాత వన్డేల పైనే ఆసక్తి చూపించకపోవడంతో ట్రై సిరీస్ పై ఏ దేశ క్రికెట్ బోర్డు పట్టించుకోలేదు. అయితే ఈ ట్రయాంగిల్ సిరీస్ కు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు మళ్ళీ శ్రీకారం చుట్టడానికి ప్రయత్నాలు చేస్తుంది. అదే జరిగితే ఆస్ట్రేలియాతో పాటు భారత్, పాకిస్థాన్ ఈ ముక్కోణపు సిరీస్ లో ఆడతాయి.
క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ నిక్ హాక్లీ ఆస్ట్రేలియా, భారత్, పాకిస్థాన్ లతో ముక్కోణపు సిరీస్‌ని నిర్వహించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సిరీస్ ను తాము నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపింది. ఆన్‌లైన్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో నిక్ హాక్లీ మాట్లాడుతూ.. "భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ లు చూడడానికి అభిమానులు ఆసక్తి చూపిస్తారు. ఇరు జట్ల బోర్డులతో అధికారికంగా ఇంకా ఎలాంటి చర్చలు జరపలేదు. ఆస్ట్రేలియా,భారత్, పాకిస్థాన్ ,ముక్కోణపు సిరీస్ నిర్వహించడానికి ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఎప్పుడూ ముందు ఉంటుంది. కానీ తుది నిర్ణయం మాత్రం ఇరు దేశాల బోర్డుల చేతిలోనే ఉంటుంది". అని ఆయన అన్నారు.
భారత్, పాకిస్థాన్ చివరిసారిగా 2012 లో ద్వైపాక్షిక సిరీస్ ఆడాయి. ముక్కోణపు సిరీస్ విషయానికి వస్తే పాకిస్థాన్ చివరిసారిగా 2008లో బంగ్లాదేశ్‌లో ముక్కోణపు సిరీస్‌లో ఆడింది. ఈ సిరీస్‌లో పాకిస్థాన్, బంగ్లాదేశ్, భారత్‌లు ఆడాయి. అంతర్జాతీయ క్రికెట్ లో 2017–18 లో బంగ్లాదేశ్ లో ట్రై-నేషన్ సిరీస్ జరిగింది. ఈ ట్రయాంగిల్ సిరీస్ లో బంగ్లాదేశ్, శ్రీలంక, జింబాబ్వే జట్లు ఆడాయి. ఐసీసీ షెడ్యూల్ ప్రకారం.. పాకిస్తాన్ వేదికగా 2025 ఛాంపియన్స్ ట్రోఫీ జరగాల్సి ఉంది. 2017 తర్వాత మొదటిసారి ఈ ఐసీసీ టోర్నీ నిర్వహించనున్నారు. ఈ ముక్కోణపు సిరీస్ ఛాంపియన్స్ ట్రోఫీకు ముందు మూడు జట్లకు ప్రాక్టీస్ గా ఉపయోగపడుతుంది.
Cricket Australia CEO Hockley expresses interest to host India, Pakistan for tri-serieshttps://t.co/TCMnqOoQs4 pic.twitter.com/XFgsDDtEya
— News Bulletin (@newsbulletin05) July 3, 2024