తెలంగాణలో వెంటనే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించండి: MP రఘునందన్ రావు

మెదక్: తెలంగాణలో వెంటనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు.  లోకల్ బాడీ ఎలక్షన్స్ తొందరగా నిర్వహించకపోతే కేంద్ర ప్రభుత్వ నిధులు ఆగిపోతాయని అన్నారు. సిద్దిపేట జిల్లా బీజేపీ కార్యాలయంలో ఆదివారం రఘునందన్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉంటే ప్రభుత్వ ప్రతినిధులు ఢిల్లీకి వెళ్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో డెంగీ కేసులు విపరీతంగా పెరిగి పోయాయని.. వెంటనే ఆరోగ్య శాఖ మంత్రి  ఆసుపత్రులను సందర్శించాలని డిమాండ్ చేశారు.

ALSO READ | పల్లా అక్రమనిర్మాణాలపై హైడ్రా ఫోకస్..

 ఇక, చెరువులు కబ్జా చేస్తే ఎవరిపైనైనా చర్యలు తీసుకోండి కానీ.. హైడ్రా పేరుతో అసలు విషయం పక్కకు పోతుందని అన్నారు. కాగా, తెలంగాణలో పంచాయతీ పాలక వర్గాల పాలన జనవరితో ముగిసింది. అప్పటి నుండి గ్రామ పంచాయతీల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలన నడుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రభుత్వం పోస్ట్ పోన్ చేసింది. పంచాయతీ పాలన ముగిసి దాదాపు 7 నెలలు కావడంతో ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది.