
హోలీ రంగుల వేడుక.. చిన్నా పెద్దా తేడా లేకుండా రంగుల్లో మునిగితేలుతారు.. డాన్సులు చేస్తారు.. గంతులేస్తారు.. రంగుల నీళ్లు కొట్టుకుంటారు.. ఇంత వేడుక ఆనందంగా ఉండాలి కానీ.. అయ్యో అనే విధంగా ఉండకూడదు కదా.. హోలీ వేడుకల్లో మరో సమస్య ఫోన్లు కరాబు కావడం.. అందుకే వేడుకల్లోకి దిగే ముందు స్మార్ట్ ఫోన్ ని జాగ్రత్తగా కాపాడుకోవటం మంచిది. అందుకోసం కొన్ని టిప్స్..
>>> జిప్‌లాక్ పౌచ్, నీళ్లు, రంగుల నుంచి ఫోన్‌ని కాపాడుకోవటం చాలా అవసరం. ఫోన్ ను కవర్లో లాక్ చేసి ప్లాస్టిక్ కవర్లో భద్రంగా ఉంచుకోవటం ఉత్తమం.
>>> ఖరీదైన ఇయర్ ఫోన్స్, పాడ్స్‌ను వాడకపోవటం మంచిది. వాటి ప్లేసులో 50, 100 రూపాయలకు దొరికే హెడ్‌సెట్స్‌ని ఉపయోగించండి.. పాడైనా పెద్ద సమస్య ఉండదు.
>>> వాటర్ ప్రూఫ్ కేసులు, బ్యాగ్స్, ఈ కామర్స్ వెబ్‌సైట్స్‌లో.. మార్కెట్‌లో తక్కువ ధరకే దొరుకుతాయి. మెడలో తగిలించుకునేటట్లు కూడా ఉంటాయి. ఇలాంటి వాటిని హోలీ రోజు కంటే ముందే ప్రిపేర్ చేసుకోండి.
>>> రబ్బర్ బెలూన్‌లను కూడా ఉపయోగించి కేసులు తయారు చేయొచ్చు. అందుకు సంబంధించిన వీడియోలు, యూట్యూబ్‌లో చాలా ఉన్నాయి.
>>> ఓల్డ్ ఫోన్.. స్మార్ట్ ఫోన్‌ను పక్కన పడేయడం బెటర్, కాంటాక్ట్స్, ట్రాన్స్‌ఫర్ చేయటం.. ఉన్నంతలో డ్యామేజిని నిలవరించవచ్చు. హెడ్‌ఫోన్, స్పీకర్ గ్రిల్, మైక్రో, యూఎస్‌బీ పోర్ట్ టేప్‌తో సీల్ చేయడం మరో మార్గం
>>> హోలీ సెలబ్రేషన్లను సెల్పీలు, ఫొటోలు తీసుకుంటారు కొందరు. ఆ హ్యాపీనెస్ లో ఫోన్‌కు రంగులు
అంటాడమో లేదంటే ఫోన్ నీళ్లలో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి సెల్ఫీలు దిగే సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే సెల్పీ స్ర్టీక్స్ ఉపయోగించాలి.
>>> ఒకవేళ ఫోన్ తడిసిందంటే.. ఛార్జింగ్ పెట్టొద్దు. ఎండలో అరబెట్టడం ఉత్తమం. హెయర్ డ్రైయర్స్‌ని వాడకూడదు. కాలిపోయే ప్రమాదం ఉంది. ఒక గిన్నెలో రైస్ తీసుకుని మధ్యలో ఫోన్ పెట్టాలి. వీలైతే విడి పార్ట్‌లను విడదీసి అందులో ఉంచాలి. బియ్యం తేమను లాగేస్తుంది.
ALSO READ | Health Alert : తలకాయ నొప్పి తగ్గించే ఈ ట్యాబ్లెట్.. క్యాన్సర్ కణాలను చంపేస్తుందా..!
హోలీ వేడుకల తర్వాత.. అయ్యో ఫోన్ పాడైపోయింది.. నీళ్లల్లో తడిసింది.. రంగులు పడి కరాబ్ అయ్యింది అని బాధపడేకంటే.. ముందుగానే ఈ జాగ్రత్తలు తీసుకోవటం మంచిది.