
ఫొటోగ్రాఫర్, కరీంనగర్/ కరీంనగర్ టౌన్, వెలుగు : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో హోలీ వేడుకలు ప్రారంభమయ్యాయి. గురువారం రాత్రి కరీంనగర్‌లోని భగత్‌నగర్‌లో నిర్వహించిన కామ దహనంలో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కలర్లు, వాటర్ గన్‌లు కొనే చిన్నారులు, పెద్దలతో పవరి సర్కిల్ ఏరియాలో సందడి నెలకొంది.
33వ డివిజన్ భగత్‌నగర్ వెల్ఫేర్ అసోసియేషన్, ఆదర్శ, చైతన్య, మహాదేవ్, పెద్దమ్మ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు పాల్గొన్నారు.