ఆనందాల హోలీ..

ఆనందాల  హోలీ..

గ్రేటర్​ సిటీలో శుక్రవారం హోలీ సంబురాలు అంబరాన్నంటాయి. చిన్నాపెద్ద అంతా కలిసి రంగుల్లో మునిగి తేలారు. రంగులు పూసుకుంటూ కాలనీల్లో యువతీయువకులు కేరింతలు కొట్టారు. డీజే పాటలకు అదిరిపోయే స్టెప్పులేస్తూ ఎంజాయ్ చేశారు. వేర్వేరుచోట్ల వందల సంఖ్యలో నిర్వహించిన హోలీ ఈవెంట్లు పాటలు, డ్యాన్సులతో హోరెత్తాయి. 

సెలబ్రిటీలు, డీజేలు ఉర్రూతలూగించారు. రెయిన్​ డ్యాన్స్ చేయించారు. రంగులు పడడంతో కండ్లు ఎర్రగా మారాయని ముగ్గురు మెహిదీపట్నం సరోజినీ దేవి కంటి ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు.– హైదరాబాద్ సిటీ, నెట్​వర్క్