హోలీ.. రంగేళీ

 డ్యాన్సులు, కేరింతలు, ఆనందోత్సవాల నడుమ సిటీలో పలు ప్రాంతాల్లో ఆదివారం హోలీ సంబరాలను నిర్వహించుకున్నా రు. ఉత్సాహంగా, సందడి చేస్తూ ఒకరికొకరు రంగులు పూసుకొని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కూకట్ పల్లి, మాదాపూర్ తదితర ప్రాంతాల్లో ప్రైవేట్​ నిర్వాహకులు ఏర్పాటు చేసిన హోలీ వేడుకల్లో యూత్ పాల్గొని సందడి చేశారు.  నాంపల్లి పబ్లిక్ గార్డెన్ లో గార్డెన్ గ్యాలరీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో బీజేపీ హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాధవీలత పాల్గొని హోలీ శుభాకాంక్షలు తెలిపారు.