టాలీవుడ్ రంగుల సంబరాలు

 టాలీవుడ్ రంగుల సంబరాలు

హోలీ పండుగ వచ్చిందంటే ప్రతి ఒక్కరిలో తెలియని ఆనందం వస్తుంది.  వయసుతో సంబంధం లేకుండా రంగులు చల్లుకుంటూ ఎంజాయ్ చేస్తుంటారు.  సినీ ఇండస్ట్రీలోనూ   హోలీ పండుగ కలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌‌‌‌‌గా జరిగింది. స్పెషల్ పోస్టర్స్‌‌‌‌‌‌‌‌తో కొందరు  శుభాకాంక్షలు తెలియజేస్తే, మరికొందరు సెట్‌‌‌‌‌‌‌‌లో గ్రాండ్‌‌‌‌‌‌‌‌గా రంగుల సంబరాన్ని చేసుకున్నారు. అలాగే పలువురు స్టార్ హీరో హీరోయిన్స్  ఫ్యామిలీతో కలిసి సెలబ్రేట్  చేసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.   

సాయి దుర్గ తేజ్ హీరోగా కేపీ రోహిత్ తెరకెక్కిస్తున్న ‘సంబరాల  యేటిగట్టు’ టీమ్ హోలీని సెట్‌‌‌‌‌‌‌‌లోనే సెలబ్రేట్ చేసుకుంది. ఈ సందర్భంగా న్యూ పోస్టర్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు. ఇందులో  టీమ్ అంతా  కనిపిస్తున్నారు.  ప్రస్తుతం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో వేసిన స్పెషల్ సెట్‌‌‌‌‌‌‌‌లో సాంగ్‌‌‌‌‌‌‌‌ను షూట్ చేస్తున్నారు. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక రాజ్ తరుణ్​ హీరోగా రామ్ కడుముల రూపొందిస్తున్న ‘పాంచ్ మినార్’ నుంచి హోలీ విషెస్ చెబుతూ కొత్త పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు. అలాగే ఫస్ట్ లిరికల్ సాంగ్‌‌‌‌‌‌‌‌ను త్వరలోనే విడుదల చేయబోతున్నట్టు అప్‌‌‌‌‌‌‌‌డేట్ ఇచ్చారు.

 బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్,  నారా రోహిత్ హీరోలుగా విజయ్ కనకమేడల రూపొందిస్తున్న చిత్రం ‘భైరవం’. ఈ మూవీ టీమ్ ప్రేక్షకుల మధ్య హోలీని సెలబ్రేట్ చేసుకుంది. సాయి శ్రీనివాస్, అదితి శంకర్ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన హోలీ పార్టీలో సందడి చేశారు. 

కెకె రాధామోహన్‌‌‌‌‌‌‌‌ నిర్మిస్తున్న  ఈ చిత్రం సమ్మర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రిలీజ్ కానుంది. సిద్ధు జొన్నలగడ్డ, రాశి ఖన్నా,  శ్రీనిధి శెట్టి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ‘తెలుసు కదా’ చిత్రం నుంచి హోలీ శుభాకాంక్షలతో స్పెషల్ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంతో  స్టైలిస్ట్ నీరజా కోన దర్శకురాలిగా పరిచయం అవుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది.  సిద్ధు నటిస్తున్న మరో చిత్రం ‘జాక్’ నుంచి హోలీ కానుకగా కిస్ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. అంకిత్ కొయ్య, నీలఖి జంటగా ‘భలే ఉన్నాడే’ ఫేమ్ వర్ధన్ రూపొందిస్తున్న ‘బ్యూటీ’ చిత్రం కొత్త పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు. ఇందులో అంకిత్, నీలఖి క్యూట్‌‌‌‌‌‌‌‌గా కనిపిస్తూ ఇంప్రెస్ చేశారు.