హోలీ పండుగరోజు ఎవరిపై రంగులు జల్లాలో తెలుసా... ఎక్కడ ఎలా జరుపుకుంటారంటే... 

హోలీ అంటే ఏడాదికి ఒకసారి వచ్చే హిందూ పండగ. ఈరోజున ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటారు. అయితే హోలీ పండుగ ఎవరిపై రంగులు జల్లాలి.. శాస్త్రాలు ఏం చెబుతున్నాయి. హోలి పండుగ గురించి తెలియని కొన్ని విషయాలను తెలుసుకుందాం. . .

 హోలీని రంగుల పండుగ అని  పిలుస్తారు, ఇది భారతదేశంలోనే కాకుండా నేపాల్‌లో కూడా ప్రధానంగా జరుపుకునే హిందూ పండుగ. ఫాల్గుణ పౌర్ణమి రోజున దీనిని జరుపుకుంటారు. ఈ 2024వ సంవత్సరంలో హోలీని మార్చి25న జరుపుకుంటున్నాము. హోలీ రోజున ఒకరిపై ఒకరు రంగులు చల్లుకోవడం తెలిసిందే...అయితే  హోలీ రోజు రంగులను అందరు చల్లుకోరు. ముఖ్యంగా సోదర బంధం కలిగిన వారు ఒకరికొకరు చల్లుకోరు, తోడబుట్టిన వారిపై రంగులు చల్లరు. ఈ రంగు చల్లడం అనేది బావా మరదల్లు, వరస అయ్యే వారితోనే రంగులాట ఆడతారు. అయితే స్నేహితులకు, పరిచయం లేని వారికి కూడా ఈ రంగులు చల్లవచ్చు. కానీ  గొడవలు జరగకుండా హిందీలో ఒక పాపులర్ సామెత ఉంటుంది.. బురా నా మానో హోలీ హై  అని. పరిచయంలేని వారిపై రంగు చల్లినపుడు...  వారు కోప్పడకుండా.. తప్పుగా అర్థం చేసుకోకూడదు..  హోలీ పండగ సంబరాల్లో  పాల్గొనాలి. అంతేకాని గొడవలు పెట్టుకోకూడదు.  సంబరాలు జరుపుకొనే సమయంలో వాగ్వాదాలు పెట్టుకొంటే హోలీ పండుగకు అర్దమే ఉండదని గ్రహించాలి. 

హోలీ పండుగ సంప్రదాయాలు  తెలియని  ఉత్తర ప్రదేశ్‌లోని బర్సానా పట్టణంలో జరుపుకునే లాత్మార్ హోలీ జరుపుకుంటారు.  ఇక్కడ మహిళలు... పురుషులను కర్రలతో కొడుతూ... సరదా యుద్ధంలో పాల్గొంటారు. మగవారిని రెచ్చగొట్టే విధంగా పాటలు పాడతారు. రాధాకృష్ణుల ప్రేమకు చిహ్నంగా హోలీ పండుగ జరుపుకుంటారు.

ప్రజలకు అంతగా తెలియని మరొక హోలీ సంప్రదాయం బృందావన్... ఇది  మధురలో జరుపుకునే  ఫూలోన్ కి హోలీ  పండుగ. హోలీని జరుపుకోవడానికి రంగులకు బదులుగా పువ్వులు ఉపయోగిస్తారు. లాత్మార్ హోలీ, ఫూల్ కీ హోలీ నుంచి లడ్డూ మార్ హోలీ వచ్చింది.  దీంట్లో లడ్డూలు విసురుకుంటారు. ఇది క్రమంగా రూపాంతరం చెందుతూ టొమాటోలు, కోడిగుడ్లు విసురుకోవడం ప్రారంభమైంది. భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో హోలీని  డోల్ జాత్రా  లేదా  డోల్ పూర్ణిమ  అని కూడా పిలుస్తారు. అలంకరించిన ఊయల మీద శ్రీకృష్ణుడు, రాధ విగ్రహాలను ఊరేగిస్తూ జరుపుకుంటారు.

హోలీ రోజున భాంగ్ తాగడం ఒక సాంప్రదాయం. కొన్నిసార్లు ఇది సమస్యాత్మకంగా కూడా పరిణమిస్తుంది. హోలీ వేసవిలో వస్తుంది. రంగులు చల్లినపుడు శరీరం ఆ మంట, చికాకు నుంచి ఉపశమనం పొందేందుకు గంజాయి మూలికలు కలిపిన తాండయి సేవిస్తారు. శివుడు బూడిద చల్లుకొని తాండయి సేవిస్తాడు అనే పురాణ కథలు ఉన్నాయి. హోలీ పండుగ శివునితో ముడిపడి ఉంటుంది కాబట్టి, భాంగ్ తాగడం సాంప్రదాయంగా కొంతమంది పాటిస్తారు.

నేపాల్‌లో జరుపుకునే హోలీ పండుగను ఫాగు పూర్ణిమ లేదా హోలియా అని పిలుస్తారు. భారతదేశంలో హిందువులు జరుపుకున్నట్లే వీరి వేడుకలు ఉంటాయి. కామదహనం చేస్తారు, రంగు నీళ్లు చల్లుకుంటారు. హోలీ రోజు నేపాల్ దేశంలో  జాతీయ సెలవుదినంగా ప్రకటిస్తారు.  ప్రస్తుతం  హోలీ ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రసిద్ధ పండుగగా మారింది, అనేక దేశాలు  హోలీ ఈవెంట్‌లు, వేడుకలను నిర్వహిస్తున్నారు.