14న దేశం మొత్తం సెలవు.. లిక్కర్, బ్యాంకులు, స్కూల్స్ అన్నీ బంద్

14న దేశం మొత్తం సెలవు.. లిక్కర్, బ్యాంకులు, స్కూల్స్ అన్నీ బంద్

దేశం మొత్తం సెలవు.. అవును 2025, మార్చి 14వ తేదీన దేశం మొత్తం సెలవు.. కారణం హోలీ పండుగ. రేపు అంటే మార్చి 14వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో స్కూల్స్, కాలేజీలకు సెలవు. బ్యాంకులు బంద్.. వైన్స్ షాప్స్, బార్లు, పబ్స్ క్లోజ్.. టోటల్ గా అన్నీ బంద్ కానున్నాయి.

తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీలో పబ్లిక్ హాలిడే.. ప్రభుత్వ ఆఫీసులకు సెలవు. ప్రైవేట్ వ్యవస్థలకు కూడా హాలిడే ప్రకటించాయి యాజమాన్యాలు. 
హోలీ సందర్భంగా మార్చి 14వ తేదీ శుక్రవారం స్టాక్ మార్కెట్ కూడా బంద్
తెలంగాణ, ఏపీలో బ్యాంకులకు సెలవు ప్రకటించారు
ఐటీ కంపెనీలు కూడా హోలీ హోలిడే ఇచ్చేశాయ్.. శుక్రవారం హోలీ హాలిడే.. శని, ఆదివారాలు వీకెండ్ కావటం.. ఐటీ ఉద్యోగులకు వరసగా మూడు రోజులు సెలవు వచ్చింది.

Also Read :- హోలీ ఏ రాష్ట్రంలో ఎలా.. రంగులు ఒకటే కానీ

తెలంగాణ, ఏపీలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు కూడా శుక్రవారం అంటే మార్చి 14న సెలవు ఇచ్చారు

దేశంలోని మిగతా అన్ని రాష్ట్రాలు కూడా సెలవు ప్రకటించేశాయి. దేశ రాజధానిలోనూ లిక్కర్ షాపులు మూసివేయనున్నారు. స్కూల్స్, కాలేజీలకు అయితే వరసగా మూడు రోజులు సెలవు ప్రకటించింది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ బ్యాంకులకు హాలిడే ఇచ్చారు. 

అత్యవసర సేవలు మాత్రమే పని చేయనున్నాయి. ఆస్పత్రులు, అగ్నిమాపక సిబ్బంది వంటివి. మిగతా అన్ని రంగాలకు సెలవు.