వీకెండ్ హాలిడే రోజునే దీపావళి.. సెలవు పోయినట్టేనా..

దీపావళి.. మరో 10 రోజుల్లో ఉంది.. ఈసారి దీపావళి సెలవు ఆదివారం వచ్చింది. తెలంగాణ ప్రభుత్వ క్యాలెండర్ ప్రకారం.. ఇప్పటి వరకు అయితే ఆదివారమే దివాళీ హాలిడే అని ప్రకటించింది. దీపావళి పబ్లిక్ హాలిడే.. ఆదివారం కలిసి రావటంతో.. నవంబర్ 13వ తేదీ.. సోమవారం దీపావళి సెలవు కావాలనే డిమాండ్లు వస్తున్నాయి.. అయితే ప్రస్తుతానికి అయితే కేసీఆర్ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు..

Also Read : ఆ ముఖ్యమంత్రిని చంపేస్తాం.. వార్నింగ్ పై పోలీస్ ఎంక్వయిరీ

వెలుగుల పండుగ దీపావళికి తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. నవంబర్ 12న పండుగ నిర్వహించబడుతుంది. అయితే నవంబర్ 12 ఆదివారం  సాధారణ సెలవుల కిందకు వస్తుంది. దీంతో పండుగ సెలవును నవంబర్ 13కు మార్చాలని డిమాండ్లు వస్తున్నాయి. ఇప్పటివరకు అయితే ఆదివారమే దీపావళి సెలవుదినం.