ఫిబ్రవరి 24న విద్యాసంస్థల సెలవు

ఫిబ్రవరి 24న విద్యాసంస్థల సెలవు

ఆదిలాబాద్, వెలుగు : బంజారాల ఆరాధ్య గురువు సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఈనెల 24న ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. సోమవారం పట్టణంలోని రాం లీలా మైదాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జయంతి వేడుకల నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.   

గ్రీవెన్స్ రద్దు

ఆదిలాబాద్ కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ ను రద్దు చేసినట్లు కలెక్టర్ రాజర్షిషా ప్రకటనలో తెలిపారు.  పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా జిల్లా అధికారులు ఎన్నికల విధులు, ఎన్నికల పై శిక్షణా తరగతులు ఉన్నందున గ్రీవెన్స్ రద్దు చేసినట్లు పేర్కొన్నారు.