నిత్యం ఉద్యోగం, వ్యాపారం, సంపాదన అంటూ తీరిక లేకుండా గడిపే నేటి తరానికి పండుగలు, హాలిడేస్ వస్తే అంతకు మించిన పండగ ఉండదు. ముఖ్యంగా పండుగ సందర్భాలలో ఎక్కువ రోజులు సెలవులు దొరకడం బ్యాచ్ లర్స్ తో పాటు ఫ్యామిలీ మెన్ కు అంతకు మించిన ఎంజాయ్ మెంట్ ఉంటుందా. సొంతూళ్లకు వెళ్లడం, చిన్న నాటి ఫ్రెండ్స్ తో కలవడం, సిట్టింగ్ లు, గెట్ టు గెదర్ పార్టీలు వగైరా.. ఇ లా చెప్పుకుంటూ పోతే పండుగ సెలవులు అంటే ఎంజాయ్ కి మారుపేరు అని చెప్పవచ్చు.
ALSO READ | Good Health: తరచు టెన్షన్ పడుతున్నారా.. లైఫ్ స్టైల్ మారాల్సిందే..!
అయితే పండుగ సెలవులు ఎంజాయ్ తో పాటు హాలిడే హార్ట్ సిండ్రోమ్ (Holiday Heart Syndrome- HHS) అనే హెల్త్ రిస్క్ ను కూడా తీసుకొస్తాయని చెబుతున్నారు వైద్యులు. పండుగ పూట హెవీ డ్రింక్ చేయడం, ఎక్కువగా తినడం, నిద్ర సరిగా లేకపోవడం, స్ట్రెస్, ఓవర్ నైట్ పార్టీలతో ఈ HHS రిస్క్ ఎక్కువగా ఉంటుందట. దీని వలన హార్ట్ బీట్ అసాధరణంగా పెరిగి పోయి గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందట. కొన్ని సార్లు సడెన్ కార్డియాక్ అరెస్ట్ కూడా అవచ్చునని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఈ సిచువేషన్ ని ఆట్రియల్ ఫాబ్రిలేషన్ (atrial fibrillation -AF) అంటారు. అయితే సెలవుల్లో పార్టీ మూడ్ లో ఉండే వాళ్లు కచ్చితంగా తమ గుండె ఆరోగ్యం ఎలా ఉందో గమనిస్తుండాలని నిపుణులు అంటున్నారు. ఒకవేళ అబ్నార్మల్ గా అనిపిస్తే డాక్టర్ ను తప్పకుండా సంప్రదించాలని సూచిస్తున్నారు.
వీళ్లకు HHS వచ్చే అవకాశం ఎక్కువ:
హై బ్లడ్ ప్రెజర్ ఉన్న వాళ్లు, డయాబెటిస్, హార్ట్ ప్రాబ్లమ్స్ తదితర ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్లకు వస్తుంది. అదే విధంగా సరిగ్గా నిద్ర పోనివారికి, స్ట్రెస్, టైమ్ కు తినని వారికి, ఎక్కవ తాగేవారికి వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. వయసు మళ్లిన వారికి, టెన్షన్ పడేవారికి కూడా రావచ్చు. అంటే ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వారు సెలవుల్లో శ్రుతి మించితే హెచ్ఎస్ ఎస్ వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తు్నారు నిపుణులు.
HHS లక్షణాలు ఎలా ఉంటాయి?
HHS స్టార్ట్ అయితే గుండె దడ పెరిగినట్లు ఉంటుందట. ఎప్పుడూ ఏదో భయం అవుతున్నట్లుగా గుండెలో ఒకరకమైన ఫీలుంగ్ వస్తుందట. అలాగే కాస్త మత్తుగా ఉంటుందని చెబుతున్నారు వైద్యులు. వీటితో పాటు గుండె ఒకసారి వేగంగా కొట్టుకోవడం.. మరోసారి నెమ్మదించడం జరుగుతుందని పరిశోధన ఫలితాల ఆధారంగా తెలిపారు.
HHS రాకుండా ఉండాలంటే ఏం చేయాలి:
ఈ సిండ్రోమ్ రాకుండా ఉండాలంటే పండుగల వేళ కంట్రోల్ గా డ్రింక్ చేయాలని వైద్యులు చెబుతున్నారు. లిమిటెడ్ గా తాగడం, వేళకు నిద్ర పోవడం, టైమ్ కు తినడం మంచిదని చెబుతున్నారు. రోజుకు ఒక పెగ్గుకు పరిమితం అయితే ఇలాంటి సిండ్రోమ్స్ రావని ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) సూచించింది.