హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కురుస్తున్న భారీవర్షాలతో స్కూళ్లు, కాలేజీలకు శుక్రవారం కూడా సర్కారు హాలిడే ప్రకటించింది. అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. దీంతో సర్కారు, ప్రైవేటు, ఎయిడెడ్ విద్యాసంస్థలన్నింటికీ సెలవు ఇస్తున్నట్టు విద్యాశాఖ సెక్రటరీ వాకాటి కరుణ గురువారం ఉత్తర్వులు జారీచేశారు.
భారీవర్షాలతో ఇప్పటికే బుధ,గురువారాల్లో సెలవులు ఇవ్వగా, మరోరోజు సెలవు పొడిగిస్తున్నట్టు పేర్కొన్నారు. శనివారం మొహర్రం, ఆదివారం హాలిడే ఉండటంతో సోమవారం విద్యాసంస్థలు తెరుచుకోనున్నాయి. దీంతో ఈ నెల 30 వరకూ సెలవులు ఇచ్చినట్టయింది. సెలవులతో ఓయూ సహా పలు వర్సిటీల్లో జరిగే పరీక్షలు వాయిదా పడ్డాయి.
ALSO READ:ఇయ్యాల ( జూలై 28)న పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు
31 వరకూ దోస్త్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్
సెలవులు, వర్షాలతో దోస్త్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ గడువును మరోసారి పెంచుతున్నట్టు హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. దోస్త్ థర్డ్ ఫేజ్లో సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 31 వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయొచ్చన్నారు.