
హోలీ సంబరాలకు జనాలు సిద్దమవుతున్నారు. మార్కెట్లో ఇప్పటికే హోలీ సంబరాలు చేసుకొనేందుకు రంగులను సిద్దంగా ఉంచారు వ్యాపారులు.. ఇక గన్లు కూడా అమ్మేందుకు షాపుల బయట వేలాడదీశారు. ఆనందంతో.. జరుపుకొనే రంగుల పండుగను అన్ని వర్గాల వారు జరుపుకుంటారు. ఒకరికొకరు రంగులు పూసుకున్న తరువాత అక్కడే చేతులు... ముఖం శుభ్రం చేసుకొని స్వీట్..తింటే ఆ హాయే వేరుగా ఉంటుందిగా మరి ..ఎప్పుడూ తినే స్వీట్స్ కంటె వెరైటీ స్వీట్ తింటే ఆ రుచి.. ఆ ఆనందమే వేరుగా ఉంటుంది కదా.. మరి గుజియా అనే స్వీట్‌ను ఎలాతయారు చేయాలి.. ఆ స్వీట్ తయారీకీ ఏఏ పదార్దాలు కావాలి.. మొదలైన వివరాలు తెలుసుకుందా..
రంగులు మనసులను ఉల్లాసపరిస్తే.. తియ్యని రుచులు మదిని ఆనందంతో నింపేస్తాయి. వర్ణాలన్నీ ఏకమయ్యే శుభ సమయాన అందరి నోళ్లను ఊరించే ఘుమఘుమలు పండగ వేడుకకు మరిన్ని వన్నెలద్దుతాయి.
గుజియా స్వీట్ తయారీకి కావలసినవి
- మైదా - 3 కప్పులు
- నెయ్యి - ఒకటిన్నర కప్పు
- నీళ్లు - పావు కప్పు
- ఫిల్లింగ్ కి.. పంచదార- కప్పు
- కోవా - 200 గ్రాములు
- బాదం పప్పు - 5 (సన్నగా తరగి, నీళ్లలో నానబెట్టాలి)
- బొంబాయిరవ్వ - అర కప్పు
- యాలకుల పొడి - అర టీ స్పూన్
తయారీ విధానం: మైదా పిండిలో తగినన్ని నీళ్లు పోసి, కలిపి, చపాతీ ముద్దలా కలుపుకోవాలి. పిండి మెత్తగా కావడానికి ఒక తడి క్లాత్ కప్పి పక్కనుంచాలి. ఆ తరువాత స్టౌ పై పాన్ పెట్టి, కోవా, బొంబాయా రవ్వను బంగారు రంగు వచ్చేవరకు వేయించి, పంచదారకలిపి, మంట తీసేసి, చల్లారనివ్వాలి. చల్లారిన కోవా మిశ్రమంలో ఏలకుల పొడి, బాదంపప్పు తరుగు వేసి బాగా కలపాలి. తరువాత కొద్దిగా నెయ్యిని వేళ్లతో అద్దుకొని, అరచేతి పైన రాసి, చిన్న చిన్న పిండి ముద్దలు ఉండలుగా చేసి, అదిమి పక్కనుంచాలి. ఇప్పుడు మైదా పిండిని మృదువుగా కలిపి, చిన్న చిన్న ఉండలు చేసి, పూరీల్లా వత్తాలి.
ALSO READ | Super Food : ఈ ఫుడ్ తింటే.. రాళ్లు అయినా ఇట్టే అరిగిపోతాయి.. మలబద్దకం అనేది రాదు..!
--గుజియా ( కజ్జికాయల) అచ్చుపైన పూరీ వేసి, మధ్యలో కోవా మిశ్రమాన్ని పెట్టి, అదిమి, చుట్టూ నమూనా ప్రకారం రోల్ చేయాలి. ఇదే విధంగా అన్నీ తయారుచేసుకోవాలి. -స్టౌ పైన పాన్ పెట్టి, నెయ్యి పోసి వేడిచేయాలి. నెయ్యి కాగుతున్నప్పుడు సిద్ధం చేసుకున్న గుజియాలను వేసి, రెండు వైపులా వేయించి తీయాలి. ఇలా తయారుచేసుకున్న గుజియాలను ప్లేట్లో పెట్టి, తరిగిన బాదంపప్పును అలంకరించి సర్వ్ చేయాలి.