- ఆయన కుమార్తెలతో సహా పైలట్ కూడా దుర్మరణం
లాస్ ఏంజిలిస్: విమాన ప్రమాదంలో ప్రముఖ హాలీవుడ్ నటుడు క్రిస్టియన్ ఒలివర్ మృతి చెందాడు. గురువారం మధ్యాహ్నం చోటు చేసుకున్న ఈ దుర్ఘటనలో అతడి ఇద్దరు కుమార్తెలతో సహా పైలట్ కూడా మరణించారు. సెలవులను సరదాగా గడిపేందుకు ఒలివర్ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ఓ ప్రైవేటు విమానంలో సెయింట్ లూసియాకు బయలు దేరారు. వీరు ప్రయాణిస్తున్న విమానంలో బయలు దేరిన కాసేపటికే సాంకేతిక లోపం తలెత్తింది. ఆపై కరీబియన్ సముద్రంలో కూలిపోయింది. సమాచారం అందుకున్న కోస్ట్ గార్డ్ ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయినా వారిని కాపాడలేకపోయారు. ఒలివర్, ఆయన పిల్లలతోపాటు పైలట్ మృతదేహాన్ని సముద్రంలో నుంచి వెలికితీశారు. కాగా, యాభై ఏండ్ల క్రిస్టియన్ ఒలివర్ దాదాపు 60కి పైగా సినిమాల్లో నటించాడు. ‘ద బేబీ సిట్టర్స్ క్లబ్’, ‘ద గుడ్ జర్మన్’, ‘స్పీడ్ రేసర్’ వంటి చిత్రాలతో స్టార్ డమ్ సంపాదించుకున్నాడు.