పలు హాలీవుడ్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ పాల్ ష్రాడర్ ఇటీవలే ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొన్నాడు. ఇందులోభాగంగా బాలీవుడ్ స్టార్ హీరో బాద్ షా షారుఖ్ ఖాన్ హాలీవుడ్ డెబ్యూ సినిమాపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇందులో భాగంగా షారుఖ్ ఖాన్ ని దృష్టిలో ఉంచుకుని 'ఎక్స్‌ట్రీమ్ సిటీ' అనే సినిమా స్టోరీ రాశానని తెలిపాడు. ఈ కథ ఇండియన్ పోలీస్ మరియు అమెరికా పోలీస్ మధ్య జరిగే యాక్షన్ ఎంటర్టైనర్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని వెల్లడించాడు.
అయితే ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ తో పాటూ హాలీవుడ్ ప్రముఖ హీరో లియోనార్డో డికాప్రియో స్క్రీన్ షేర్ చేసుకుంటాడని చెప్పుకోచ్చాడు. ఈ సినిమాని హాలీవుడ్ చిత్రాల్ని నిర్మించిన మార్టిన్ స్కోర్సెస్ నిర్మించేందుకు ముందుకొచ్చాడని ఈక్రమంలో పలుమార్లు ముంబై కి వెళ్లి షారుఖ్ ఖాన్ తో స్టోరీ నేరేషన్ చేశానని కానీ అనుకోని కారణాలవల్ల ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదని ఇందుకు చాలా బాధ కలిగిందని ఎమోషనల్ అయ్యాడు.
Also Read:-అల్లు అర్జున్ టీంపై క్రిమినల్ కేసు నమోదు...
అయితే షారుఖ్ ఖాన్ ఈ సినిమాలో రెండో హీరోగా ఉండటం, లియోనార్డో డికాప్రియో కి హాలీవుడ్ లో మంచి పాపులారిటీ ఉండటంతో షారుఖ్ ఖాన్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. అంతేగాకుండా బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ తన సినిమాలో నటించే క్యాస్ట్ & క్రూ ని కూడా తానే నిర్ణయిస్తాడు. ఈ క్రమంలో దర్శకనిర్మాతలతోపాటూ నటీనటులు, టెక్నీషియన్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ ఇలా అన్ని విషయాల్లో షారుఖ్ ఖాన్ హ్యాండ్ ఉంటుంది. కానీ హాలీవుడ్ లో మాత్రం ఇలా కుదరదు. దీంతో ఈ అంశాల్ని పరిగణిలోకి తీసుకుని షారుఖ్ ఖాన్ హాలీవుడ్ ఎంట్రీని క్యాన్సిల్ చేసుకున్నట్లు సమాచారం. ఇక లియోనార్డో డికాప్రియో కూడా చివరికి సుముఖంగా లేకపోవడంతో ఈ ప్రాజెక్ట్ ని పూర్తిగా నిలిపివేశారు.