దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్(RRR) సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం ఇండియాలోనే కాదు ప్రపంచ సినీ ప్రేక్షకులను సైతం అలరించింది ఈ సినిమా. అంతేకాదు.. హాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ సైతం ఆర్ఆర్ఆర్ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. దాంతో.. తెలుగు సినిమా స్థాయి ప్రపంచా స్థాయికి చేరుకుంది. ఇక ఆస్కార్ అవార్డు అందుకున్న తొలి సౌత్ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది ఆర్ఆర్ఆర్ మూవీ.
ALSO READ | Vishwambhara: చిరంజీవితో ఆషిక రంగనాథ్.. స్ట్రాంగ్ అప్డేట్ ఇచ్చిన విశ్వంభర టీమ్
అయితే ఈ సినిమా తాజాగా తన అభిప్రాయాన్ని తెలియజేశారు హాలీవుడ్ స్టార్ హీరోయిన్ అన్నే హాత్వే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమెను ఆర్ఆర్ఆర్ సినిమా గురించి అడిగారు. దానికి సమాధానంగా ఆమె మాట్లాడుతూ.. అందరిలాగే నేను కూడా ఆర్ఆర్ఆర్ సినిమా చూశాను. చాలా అధ్బుతంగా ఉంది. ఈ సినిమాలో నటించిన ఇద్దరు స్టార్స్ లో ఎవరితోనైనా నటించడం అనేది నిజంగానే ఒక డ్రీం.. అంటూ చెప్పుకొచ్చారు అన్నే హాత్వే. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక అన్నే హాత్వే సినిమాల విషయానికి వస్తే.. ఆమె ఇంటర్ స్టెల్లార్, ద డార్క్ నైట్ రైజెస్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించారు. ప్రస్తుతం ఆమె ద ఐడియా ఆఫ్ యూ.. అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతోంది.