
న్యూఢిల్లీ, వెలుగు: హర్యానా రాజ్ భవన్ లో గురువారం హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. గవర్నర్ బండారు దత్తాత్రేయ నిర్వహించిన ఈ హోలీ వేడుకల్లో హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైనీ, స్పీకర్ హర్విందర్ కల్యాణ్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ దత్తాత్రేయ రంగులు చల్లి సంబురాలను ప్రారంభించారు. అనంతరం ఒకరికొకరు హోలీ శుభాకాంక్షలు చెప్పుకుంటూ... రంగులు పూసుకున్నారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ.. దేశ ప్రజలు ఈ వేడుకల్ని ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని ఆకాంక్షించారు.