
రంగుల పండగలో సిటీ జనం రెడీ మునిగితేలుతున్నారు. గల్లీల్లో రంగులు చల్లుకునుడు కామనే అయినా..కొంతకాలంగా పబ్లిక్ఈవెంట్స్కు వెళ్లి ఫ్రెండ్స్, ఫ్యామిలీతో సెలబ్రేట్చేసుకొనే ట్రెండ్ఎక్కువఅయింది. నగరంలో నిర్వహించే ఈవెంట్లలో సినీ సెలబ్రేట్స్ సందడి చేస్తారు. ఈ ఏడాది ( 2025) జరిగే హోలీ ఈవెంట్లలో తాను పాల్గొనని సినీ నటి కాజల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
సిటీలో ప్రతి హోలీకి ఈవెంట్ ఆర్గనైజర్స్ పోటీ పడుతూ వేడుకలు నిర్వహిస్తున్నారు. జనాలను రప్పించడానికి డిఫరెంట్థీమ్స్తో సెలబ్రేషన్స్ఆర్గనైజ్చేస్తున్నారు. ప్రైమ్ఏరియాలు, హోటల్స్, కన్వెన్షన్సెంటర్లు, గ్రౌండ్స్, క్లబ్స్, రిసార్ట్స్‌లలో ఈవెంట్స్నిర్వహిస్తున్నారు.
సిటీలో పోటాపోటీగా హోలీ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. దాదాపు 200 చోట్ల హోలీ ఈవెంట్స్ ఏర్పాట్లు చేశారు. ఒక్కో ఈవెంట్ లో పాల్గొంటున్న వేయి నుంచి మూడు వేలమంది పాల్గొనే విధంగా ఆర్గనైజర్లు చర్యలు తీసుకున్నారు. రైన్ డ్యాన్స్, టమాట & బెలూన్ ఫైట్స్, వాటర్ గన్స్, లైవ్ మ్యూజిక్, డీజేల సందడితో సీటీ హొరెత్తుతుంది.
Also Read : సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ - ఎక్కడ చూడాలంటే?
హోలీ సంబరాల్లో సినీ సెలబ్రెటీలు సందడి చేస్తున్నారు. ఫ్లిప్ సైడ్ అడ్వెంచర్ పార్క్ లో సందడి హెబ్బా పటేల్ చేయబోతున్నారు. హైటెక్స్ క్రికెట్ గ్రౌండ్ లో జరిగే హోలీ వేవ్ ఈవెంట్ లో అనసూయ భరద్వాజ్, నిధి అగర్వాల్ హోలీ ఆడతారు. మాదాపూర్ లోని మ్యాన్ మేడ్ హిల్స్ లో హోలీనేషన్ పేరుతో జరిగే సెలబ్రేషన్స్ కు చీఫ్ గెస్ట్ గా కాజల్ అగర్వాల్ వస్తుందంటూ పుకార్లు వచ్చాయి. అయితే ఈవెంట్ ఆర్గనైజర్ల లోపాల వల్ల హోలీ ఈవెంట్ లో పాల్గొనట్లేదని ఇన్స్టాగ్రామ్ లో కాజల్ అగర్వాల్ పోస్ట్ చేసింది.