హైదరాబాద్​లో మొదలైన హోలీ సంబరాలు.. నాంపల్లి ఎగ్జిబిషన్​ గ్రౌండ్ లో సందడే సందడి

హైదరాబాద్​లో మొదలైన హోలీ సంబరాలు.. నాంపల్లి ఎగ్జిబిషన్​ గ్రౌండ్ లో సందడే సందడి

రంగులతో ఆడుకుంటూ ఆనందించే ఏకైక పండుగ హోలీ.  దేశవ్యాప్తంగా హోలీ సందడి మొదలైంది. నగరంలో ఎక్కడ చూసినా అదే రంగులు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ముందస్తుగా హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. వనిత మహిళా కళాశాల విద్యార్థులు  అంతా కలిసి రంగుల పండగను ఆహ్లాదంగా జరుపుకొన్నారు. ఒకరినొకరు కలిసి రంగులు పూసుకుంటూ సందడి చేశారు.  రేపు  (మార్చి 14) కళాశాలకు సెలవు కావడంతో పెద్ద ఎత్తున విద్యార్థినిలు కలిసి సరదాగా ఆడుకున్నారు. ఈ సందర్భంగా... డీజే పాటలకు నృత్యాలు చేస్తూ హోరెత్తించారు.

చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు రంగులు పూసుకుని ఎంతో ఆనందంగా పండుగ జరుపుకుంటారు. జీవితాల్లో ఆనందాన్ని నింపడమే ఈ పండుగ ముఖ్య ఉద్దేశం. రంగులతోనే కాకుండా డీజే పాటలు, రెయిన్ డ్యాన్స్‌లతో ఎంజాయ్ చేస్తారు.  యువతరం ఈ పండుగను స్నేహితులు, కుటుంబ సభ్యులతో రంగుల హరివిల్లుల్లో ఆటలతో ఘనంగా జరుపుకుంటారు. చాలా మంది ఒకరికొకరు రంగులు వేసుకుని సెల్ఫీలు దిగడం..  స్మార్ట్‌ఫోన్‌లు వచ్చాక ఫోటోలు తీయడం యువతకు అలవాటుగా మారింది.