తెలంగాణలో ఏడుగురు నాన్ క్యాడర్ ఎస్పీల బదిలీ

తెలంగాణలో ఏడుగురు నాన్ క్యాడర్ ఎస్పీల బదిలీ
  • ఉత్తర్వులు జారీ చేసిన హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా

హైదరాబాద్,వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ఏడుగురు నాన్ క్యాడర్  ఎస్పీలను బదిలీ చేస్తూ హోం శాఖ స్పెషల్  చీఫ్  సెక్రటరీ రవిగుప్తా  గురువారం  ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ సిటీ ఉమెన్  సేఫ్టీ వింగ్  ఎస్పీగా ఉన్న కవితను హైదరాబాద్  సిటీ డీసీపీ సైబర్ క్రైమ్స్ కు బదిలీ చేశారు.  కమాండ్  కంట్రోల్  సెంటర్ ఎస్పీగా ఉన్న రమణా రెడ్డిని  మల్కాజ్​గిరి ఎస్ఓటీ  డీసీపీగా బదిలీ చేశారు. పోస్టింగ్  కోసం వెయిటింగ్ లో ఉన్న ఎస్పీ వెంకటేశ్వర్లును ఆక్టోపస్  అడ్మిన్ ఎస్పీగా నియమించారు. 

మేడ్చల్  ఎస్ఓటీ డీసీపీ డి.శ్రీనివాస్ ను ఎస్ఓటీ మాదాపూర్  డీసీపీగా,  సీఐడీ ఎస్పీగా ఉన్న శ్రీబాలదేవిని సైబరాబాద్  సైబర్ క్రైం డీసీపీగా, ఇంటెలిజెన్స్ లో ఎస్పీగా ఉన్న సునీతను తెలంగాణ పోలీస్  అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ గా బదిలీ చేశారు. టీజీ  నార్కో టిక్స్  బ్యూరో అడ్మిన్  ఎస్పీగా ఉన్న  వై.సాయి శేఖర్  ఇంటెలిజెన్స్ ఎస్పీగా బదిలీ అయ్యారు. జగిత్యాల అడ్మిన్  అడిషనల్  ఎస్పీ  ఎస్ వినోద్ కుమార్ ను ఇంటెలిజెన్స్  అడిషనల్ ఎస్పీగా బదిలీ చేశారు.