విధుల్లో ఉన్న హోంగార్డుని ఢీకొట్టిన బైక్

విధుల్లో ఉన్న హోంగార్డుని ఢీకొట్టిన బైక్

హైదరాబాద్ లో ద్విచక్రవాహనదారులు రెచ్చిపోతున్నారు.  గురువారం అర్దరాత్రి విధులు నిర్వహిస్తున్న హోంగార్డు కిష్టయ్య బైక్ పై దూసుకెళ్లింది..  పూర్తి వివరాల్లోకి వెళ్తే... గురువారం అర్దరాత్రి తెలుగుత్లి ఫ్లై ఓవర్ కింద  న్యూ సిగ్నల్ వద్ద    సైఫాబాద్ ట్రాఫిక్ హోంగార్డు  కిష్టయ్య  విధులు నిర్వహిస్తున్నారు.  

అర్దరాత్రి 12 గంటలు దాటిన తరువాత కిష్టయ్య రోడ్డు దాటుతున్నాడు.  ఆ సమయంలో అటుగా వేగంగా వస్తున్న బైక్  ఢీకొట్టి...  అతను  ఆగకుండా వెళ్లిపోయాడు.  ఇక్బాల్ మినార్ నుంచి పాత అంబేద్కర్ విగ్రహం వైపు డియో ద్విచక్ర వాహనంపై వేగంగా, నిర్లక్ష్యంగా వచ్చిన రైడర్ అతనిని ఢీకొట్టాడు

ఈ ప్రమాదంలో హోంగార్డు కిష్టయ్య తలకు  బలమైన గాయం కావడంతో రోడ్డుపై పడిపోయాడు. సమాచారం అందుకున్న  సైఫాబాద్ లా అండ్ ఆర్డర్ పోలీసులు  ఘటనా స్థలానికి చేరుకొని ప్రాథమిక చికిత్స కోసం దగ్గర్లోని  గ్లోబల్ ఆస్పత్రికి తరలించారు.  తరువాత మెరుగైన చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ద్విచక్ర వాహనదారుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.