వరంగల్ సిటీ, వెలుగు : వరంగల్ సిటీలో ఓ హోంగార్డు హల్ చల్ చేశాడు. కాశిబుగ్గ ఏరియాలో మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో హోంగార్డు సుకుమార్ తల్వార్ చేతిలో పట్టుకొని రోడ్డు మీదకు వచ్చాడు. రద్దీగా ఉండే రోడ్డుపై నిలబడి తల్వార్ తిప్పడంతో స్థానికులు
వాహనదారులు భయాందోళనతో పరుగులు తీశారు. స్థానికంగా వ్యాపారులు షాపులను మూసివేసుకున్నారు. సమాచారం తెలియడంతో ఇంతేజార్గంజ్ పోలీసులు వెళ్లి హోంగార్డును అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.