నారాయణపేట, వెలుగు : హోంగార్డుల సంక్షేమానికి కృషి చేస్తామని ఎస్పీ యోగేశ్గౌతమ్ తెలిపారు. శుక్రవారం ఎస్పీ ఆఫీస్లో హోంగార్డ్ దర్బార్ నిర్వహించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ హోంగార్డ్స్ బదిలీ గురించి లిస్టు తయారు చేశామన్నారు. ప్రపోజల్స్ పంపించామని, త్వరలో బదిలీ చేస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ తయారు చేస్తామని, యూనిఫాం వేసుకున్న ప్రతి ఒక్కరికీ క్రమశిక్షణ ముఖ్యమని పేర్కొన్నారు.
ప్రతి 3 నెలలకు ఒకసారి దర్బార్ నిర్వహించి, వ్యక్తిగత, విధి నిర్వహణలో సమస్యలు ఉంటే పరిష్కరిస్తామని చెప్పారు. పోలీస్ శాఖలో పని చేస్తూ సర్వీస్ రూల్స్ బ్రేక్ చేయవద్దని, క్రమశిక్షణతో పని చేయాలని సూచించారు. పోలీస్ శాఖలో పని చేస్తూ నిబంధనలు అతిక్రమిస్తే భవిష్యత్తులో ఎదురయ్యే ఇబ్బందులు వివరించారు. కార్యక్రమంలో హోంగార్డ్స్ కమాండెంట్ వెంకటేశ్వర్లు, అడిషనల్ ఎస్పీ రియాజ్, ఎస్బీ ఇన్స్పెక్టర్ రాంలాల్ ఉన్నారు.