హైదరాబాద్: ఆర్ధిక ఇబ్బందులతో హోంగార్డ్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం (అక్టోబర్ 17, 2024) జరిగింది. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకట్ రెడ్డి నగర్లో నివాసం ఉండే హోం గార్డు వెంకట రమణయ్య(39) ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పంజాగుట్ట ఏసీపీ కార్యాలయంలో హోంగార్డు రమణ పని చేస్తున్నాడు.
ఆర్ధిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణమని పోలీసులు చెప్పారు. తెలంగాణలో 18 వేల మందికి పైగా హోంగార్డులు ఉండగా.. వారంతా సివిల్, ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌తో పాటు పలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో డిప్యుటేషన్‌పై విధులు నిర్వరిస్తున్నారు. పోలీస్ శాఖలోని పలువురు ఉన్నతాధికారుల ఇళ్లలోనూ పనిచేస్తున్నారు. హోంగార్డుల వేతనం నెలకు 28 వేల రూపాయలు.
ALSO READ | కొత్త అప్పులు 49 వేల కోట్లు.. పాత అప్పులు, వడ్డీల కింద కట్టింది 56 వేల కోట్లు