పంజాగుట్ట, వెలుగు: పంజాగుట్ట పరిధిలో ఓ కారు డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. నాగార్జున సర్కిల్ వద్ద ట్రాఫిక్ పోలీసులు వాహనాలు చెక్ చేస్తున్న క్రమంలో ఆగకుండా ముందుకు దూసుకెళ్లాడు. అడ్డొచ్చిన హోంగార్డును కారుతో ఢీ కొట్టి, కొంతదూరం బానెట్‌పై ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటనలో హోంగార్డు రమేశ్‌కు స్వల్ప గాయాలయ్యాయి.
ఈ నెల 4న ఈ ఘటన జరగగా, బాధితుడి ఫిర్యాదుతో పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ర్యాష్ డ్రైవింగ్‌కు పాల్పడిన నిందితుడిని ఎంజే కాలేజీ స్టూడెంట్ సయ్యద్గా గుర్తించారు. ప్రస్తుతం అతడి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం.