సూర్యాపేట జిల్లా : జిల్లాలో డెంగీ జ్వరంతో శుక్రవారం హోంగార్డు మృతి చెందాడు. మఠంపల్లి పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు జానీ కొన్ని రోజులుగా అనారోగ్యం బారిన పడ్డాడు. డెంగీ జ్వరంతో జానీబాధపడుతున్నాడు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ.. అనారోగ్యం పూర్తిగా క్షీణించి శుక్రవారం చినిపోయాడు. జానీ స్వస్థలం హుజూర్నగర్ మండలం లింగగిరి గ్రామం.