మనిషా.. రాక్షసుడా : ఫ్యామిలీ మొత్తాన్ని చంపి.. రక్తపు గొడ్డలితో పోలీస్ స్టేషన్ కు

ఈ ఘటన చూస్తే గుండెలు అదురుతాయి.. వీడు మనిషా.. రాక్షసుడా అనే డౌట్ వస్తుంది.. ఇంట్లోనే భార్య, కుమార్తె, భార్య సోదరి కూతురిని అత్యంత కిరాతకంగా గొడ్డలితో నరికి చంపాడు.. ఆ తర్వాత ఆ రక్తపు గొడ్డలి, రక్తపు చొక్కా, ప్యాంట్ తోనే.. ఎంతో తీరిగ్గా.. కూల్ గా పోలీస్ స్టేషన్ కు వచ్చాడు. జరిగింది చెప్పి.. అరెస్ట్ చేయమని కోరాడు.. ఇది ఈ ఘటన జరిగింది ఎక్కడో కాదు.. మన బెంగళూరు సిటీలోనే.. పోలీసులు సైతం షాక్ అయిన ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

భార్య, కూతురు, భార్య సోదరి కూతురిని హత్య చేశానని ఓ వ్యక్తి రక్తంతో తడిసిన కొడవలితో పోలీస్ స్టేషన్ కి వెళ్లడంతో పీణ్య పోలీసులు అవాక్కయ్యారు.బెంగళూరు అర్బన్ జిల్లాలోని హెబ్బగోడి పోలీస్ స్టేషన్‌లో హోంగార్డుగా పనిచేస్తున్న 40ఏళ్ళ గంగరాజు భార్య భాగ్య, కూతురు నవ్య, భార్య సోదరి కూతురుహేమావతి  కలిసి నివాసం ఉంటున్నారు. నవ్య ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుండగా.. అతని కుటుంబం  ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది.

భార్య భాగ్యపై తనకు అనుమానం ఉండేదని... ఈ విషయంపై భార్యాభర్తలు తరచూ గొడవ పడుతుండేవారని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపాడు గంగరాజు. బుధవారం ( జనవరి 8, 2025 ) మధ్యాహ్నం, కోపంతో భార్యపై కొడవలితో దాడి చేసానని... నవ్య, హేమావతి తనను మందలించి అడ్డుకోవడానికి ప్రయత్నించగా అదే కొడవలితో వారిద్దరిపై కూడా దాడి చేసానని తెలిపాడు గంగరాజు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. వీడు మనిషా, రాక్షసుడా.. ఇంత క్రూరంగా అన్నాడేంటి అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్.