నా కొడుకునే అరెస్ట్ చేస్తారా?.. మీ అంతు చూస్తానంటూ పోలీసులకు హోంగార్డ్ వార్నింగ్

పోలీస్ స్టేసన్ లో  హోంగార్డ్ హల్ చల్ చేశాడు. తన కొడుకునే అరెస్ట్ చేస్తారా? అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు.  మీ అంతు చూస్తానని హెచ్చరించాడు.   ఘట్ కేసర్ లో జరిగిన  ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

 మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల చెన్ స్నచ్చింగ్ కేసులో అజ్మీరా వెంకటేష్ ను   ఘట్ కేసర్ పోలీసులు అరెస్ట్ చేశారు.  అయితే టాస్క్ ఫోర్స్ డీసీపీ ఆఫీసులో హోమ్ గార్డ్ గా పనిచేస్తున్నాడు  నిందితుడు అజ్మీరా వెంకటేష్ తండ్రి అజ్మీరా కిషన్. దీంతో ఇవాళ ఉదయం ఘట్ కేసర్ పీఎస్ కు వెళ్లిన అజ్మీరా కిషన్  తన  కుమారుడినిఅన్యాయంగా  అరెస్ట్ చేశారంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు.  తన  కుమారుడిని  జైలుకు పంపితే   చంపేస్తానంటూ ని పోలీసులను బెదిరించాడు కిషన్ . దీంతో పోలీసులుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కిషన్ పై ఘట్ కేసర్ పోలీసులు కేసు నమోదు చేశారు.