- హాస్పిటళ్లు, వైన్‌షాపులే టార్గెట్
- ఇద్దరి అరెస్టు, 8 బైక్‌లు సీజ్
పద్మారావునగర్, వెలుగు: ఫేక్ సర్టిఫికెట్ల కేసులో ఉద్యోగం కోల్పోయిన ఓ హోంగార్డు దొంగగా మారాడు. హాస్పిటళ్లు, వైన్‌షాపులు టార్గెట్ చేసి బైకులు కొట్టేశాడు. కేసు వివరాలను చిలకలగూడ ఠాణాలో ఈస్ట్ జోన్అడిషనల్ డీసీపీ నర్సయ్య శుక్రవారం వెల్లడించారు. బోయిగూడకు చెందిన అబ్రహం జానీ (48) 1996లో పోలీస్‌శాఖలో హోంగార్డుగా చేరాడు. యాంటీ హైజాకింగ్, డీజీపీ ఆఫీసులో డ్రైవర్‌గా పనిచేశాడు. ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాల్లో చేరారన్న ఆరోపణలపై 2015లో ప్రభుత్వం పలువురిని ఉద్యోగాల నుంచి తొలగించింది. ఇందులో అబ్రహం జానీ ఒకరు.
జాబ్‌పోయిన తర్వాత మారుతీ షోరూమ్ సర్వీస్స్టేషన్ లో పనిచేసి మానేశాడు. ఈ క్రమంలో మద్యం, గంజాయికి బానిసై ఈజీమనీ కోసం బైక్ దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. ఈ ఏడాదిలో గాంధీ హాస్పిటల్లో నాలుగు, పాత గాంధీ, హెబ్రోన్చర్చి, ఎస్ఎన్ఎస్ఎల్వైన్స్, దుర్గా వైన్స్వద్ద ఒక్కొక్కటి చొప్పన బైకులు దొంగలించాడు. వరుస దొంగతనాల కేసును పోలీసులు చాలెంజ్‌గా తీసుకొని ఛేదించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని శుక్రవారం అరెస్టు చేశారు. అతడి వద్ద బైక్‌లు కొన్న పార్శిగుట్ట శ్రీనివాస్ నగర్‌కు చెందిన రావుల ఆంజనేయులను అదుపులోకి తీసుకొని, దొంగిలించిన 8 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు.