టోనర్.. చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది. రోజంతా హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. డెడ్ స్కిన్ సెల్స్‌ని తగ్గిస్తుంది. ముఖ చర్మం మీద పోర్స్ రాకుండా కాపాడుతుంది. అన్నింటికన్నా ముఖ్యంగా చర్మంపై పేరుకుపోయిన దుమ్ము, ధూళిని తొలగిస్తుంది. ఇదంతా ఓకే కానీ... వాటిలో ఉండే కెమికల్స్ చర్మానికి అంతకు పదింతలు హాని చేస్తాయి. అందుకే నేచురల్ టోనర్సే వాడాలి. వాటిని ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు...
- యాపిల్ సిడార్ వెనిగర్‌ని మించిన బెస్ట్ టోనర్ మరొకటి లేదు. ఒక టేబుల్ స్పూన్ యాపిల్ సిడార్ వెనిగర్‌ని ఒక కప్పు నీళ్లలో కలపాలి. అందులో దూదిని వేసి ఐదునిమిషాలు ఉంచాలి. తరువాత ఆ దూదితో ముఖాన్ని తుడిస్తే చర్మం మీద ఉన్న పీహెచ్, బ్యాలెన్స్ అవుతుంది. చర్మంపై మచ్చలకి కారణమయ్యే బ్యాక్టీరియా పోతుంది. మేకప్ పార్టికల్స్ కూడా పూర్తిగా పోతాయి.
- కీరదోసని మిక్సీ పట్టాలి. ఆ గుజ్జుని పొడి క్లాత్‌లో వేసి రసం పిండాలి. ఆ జ్యూస్‌ని దూదితో ముఖానికి రాసి పావుగంట తర్వాత కడగాలి. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే చర్మం శుభ్రం అవుతుంది. యాక్నెకి దారితీసే సీబమ్ ఉత్పత్తి కూడా తగ్గుతుంది.
- అరకప్పు కలబంద గుజ్జులో అరకప్పు రోజ్ వాటర్ కలిపి దూదితో ముఖానికి పట్టిస్తే చర్మం హైడ్రేట్ అవుతుంది. చర్మంపై దద్దుర్లు ఉంటే తగ్గుతాయి.