కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం లద్దాఖ్‍లో ఐదు కొత్త జిల్లాలు

కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా సోమవారం ప్రకటించారు. ఈ విషయాన్ని హోం మినిస్టర్ అమిత్ షా తన అధికారిక ఎక్స్ అకౌంట్ ద్వారా తెలియచేశారు. జమ్మూ కాశ్మీర్ 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. హోం మంత్రిత్వ శాఖ ప్రకారం.. జన్స్కార్, ద్రాస్, షామ్, నుబ్రా మరియు చాంగ్‌తంగ్ అను కొత్త జిల్లాలుగా విభజించాలని నిర్ణయించుకున్నారు.

ప్రస్తుతం లడఖ్‌లో లేహ్, కర్గి రెండు జిల్లాలు ఉన్నాయి. కొత్త జిల్లాల ప్రకటనతో లద్దాఖ్ లో మొత్తం ఏడు జిల్లాలు కానున్నాయి. ప్రభుత్వం అందించే ప్రయోజనాలను కొత్త జిల్లాల ద్వారా ప్రజల వద్దకు తీసుకెళ్తామని అమిత్ షా సోషల్ మీడియా ద్వారా తెలిపారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రధాని మోదీ లద్దాఖ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.