తెలంగాణలో నిజాం ఆనవాళ్లు లేకుండా చేస్తాం: అమిత్ షా

హైదరాబాద్: బీఆర్ఎస్ సర్కార్ తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్లు దోచుకుందన్నారు హోంమంత్రి అమిత్ షా. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన బీజేపీ సభలో ఆయన మాట్లాడుతూ.. కవిత లిక్కర్ స్కాం, మియాపూర్ భూ కుంభకోసంణ బీఆర్ ఎస్ పాపమే అన్నారు. పదేళ్ల పాలనలో మోదీ సర్కార్ పై ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేదన్నారు అమిత్ షా. నీళ్లు, నిధులు, నియామకాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ విఫలం అయ్యాయన్నారు. రెండు పార్టీలు ప్రజలను మోసం చేస్తుంటే.. మోదీ మాత్రం దేశంకోసం పోరాడుతున్నారన్నారు. 

మోదీ సర్కార్ పేదల పక్షపాతి అన్నారు హోంమంత్రి అమిత్ షా.  ట్రిపుల్ తలాక్ చట్టంతో ముస్లిం మహిళకు న్యాయం చేశామన్నారు మోదీ. మోదీ పాలనలో ఉగ్రవాదులు తోకముడిచారని చెప్పారు అమిత్ షా. బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ కుటుంబ పార్టీలన్న ఆయన.. తెలంగాణ అభివృద్ది బీజేపీ సాధ్యమన్నారు. తెలంగాణలో నిజాం ఆనవాళ్లు లేకుండా చేస్తామని చెప్పారు. 

ప్రధాని మోదీ మూడోసారి ప్రధాని కావడం ఖామన్నారు హోంమంత్రి అమిత్ షా. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ కూటమి 400 సీట్లు గెలుస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ 12 సీట్లు ఖచ్చితంగా గెలుస్తుందన్నారు. బీజేపీ ఓటు బ్యాంకు రాజకీయం చేయదన్నారు అమిత్ షా. కాంగ్రెస్ చరిత్ర చూస్తే అన్ని స్కాములే.. దేశంల 12 లక్షల కోట్ల అవినీతికి కాంగ్రెస్ హయాంలో జరిగిందన్నారు. కాంగ్రెస్ సర్కారు హయాంలో నిత్యం బాంబు పేలుళ్లు జరిగేవన్నారు హోంమంత్రి అమిత్ షా.