
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు హోంమంత్రి అనిత. వైసీపీ నేతలు రెచ్చగొట్టే ధోరణిలో వ్యవహరిస్తున్నారని.. ఎక్కువ మంది రావాలంటూ వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్ లు పెట్టారని మండిపడ్డారు. మంగళవారం జగన్ రాప్తాడు పర్యటనలో చోటుచేసుకున్న ఘటనలను ఉద్దేశించి ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు అనిత. క్రిమినల్స్ రాజకీయాల్లో ఉంటే ఎలా ఉంటారో జగనే ఉదాహరణ అని.. క్రిమినల్స్ రాజకీయాల్లో ఉంటే ఏం చేయాలో జగన్ అదే చేశారని అన్నారు అనిత.
జగన్ వస్తున్నారనే.. సెక్యూరిటీ టైట్ చేశామని.. ముందస్తు ప్రణాళిక ప్రకారమే అంతా చేశారని అన్నారు. వైసీపీ కార్యకర్తల దాడిలో పోలీసులకు గాయాలయ్యాయని అన్నారు అనిత.ఒక మాజీ సీఎం కోసం 250 మంది పోలీసులను హెలీప్యాడ్ వద్ద ఉంచారని.. జగన్ హెలికాప్టర్ లో వెళ్లకుండా రోడ్డు మార్గంలో వెళ్లేందుకే హెలీప్యాడ్ దగ్గర గొడవ సృష్టించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు అనిత.