- ప్రారంభించిన హోంమంత్రి మహమూద్ అలీ
కుషాయిగూడ/ ఉప్పల్, వెలుగు: రాచకొండ కమిషనరేట్ పరిధి చర్లపల్లిలో కొత్తగా ఏర్పాటు చేసిన పోలీస్ స్టేషన్‌ను, ఉప్పల్‌లో మహిళా పీఎస్‌ను బుధవారం హోంమంత్రి మహమూద్ అలీ మరో మంత్రి మల్లారెడ్డితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ.. మహిళల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం ఇంపార్టెన్స్ ఇస్తోందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, డిప్యూటీ మేయర్ శ్రీలతా రెడ్డి, సీపీ డీఎస్ చౌహాన్, డీసీపీలు జానకి, అభిషేక్,
మురళీధర్ పాల్గొన్నారు.