నిందితులు ఎవరైనా కఠిన చర్యలు తీసుకుంటాం

జూబ్లీహిల్స్ మైనర్ బాలిక కేసు విషయంలో రాష్ట్ర హోం మంత్రి మహమూద్ ఆలీ స్పందించారు. నిందితులు ఎవరైనా వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు జరుగుతోందని, ఈ ఘటనలో పోలీసులపై వత్తిడి ఉందన్న ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. వారిపై ఎలాంటి వత్తిడి లేదన్న ఆయన...మైనర్ కావడంతో పోలీసులు వారి పరిధిలో విచారణ జరుపుతున్నారని వెల్లడించారు. కానీ.. ఇలాంటి ఘటనలు జరుగుతుండడం బాధాకరమని హోం మంత్రి మహమూద్ ఆలీ తెలిపారు. 

జూబ్లీ హిల్స్ మైనర్ బాలికపై అత్యచారం జరిగిన ఘటన ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఘటనలో ప్రముఖుల పేర్లు ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ప్రతిపక్షాలు ఆందోళనలు, నిరసనలు చేపడుతున్నాయి. ఇందులో ఓ రాజకీయ పార్టీకి చెందిన కొడుకు ఉన్నాడని, కేసును తారుమారు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. జనసేన, కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన నేతలు ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలో...కేసులో ఫొటోలు, వీడీయోలను బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు విడుదల చేశారు. ఎమ్మెల్యే కొడుకు లేడని పోలీసులు ఎలా చెబుతారని ప్రశ్నించారు. రెడ్ కలర్ మెర్సిడెస్ బెజ్ కారులో ఈ ఘటన జరిగిందని, కానీ పోలీసులు ఇన్నొవాలో ఉన్నవారి అరెస్టు చేశారని తెలిపారు. మరోవైపు.. శుక్రవారం యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు డీజీపీ ఆఫీసు ముట్టడించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. 

మరిన్ని వార్తల కోసం : -

పబ్స్‌‌పై నియంత్రణ ఎందుకు లేదు ?


నిందితుల ఫోటోలు ఎందుకు చూపించడంలేదు..