అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు

అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు

హైదరాబాద్: అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు. నెక్లెస్ రోడ్డు పీపుల్ ప్లాజాలో అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా తెలంగాణ ఫైర్ ఫైటర్స్ రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి...  ఫైర్ డిపార్ట్ మెంట్ లో అత్యుత్తమ సేవలు అందించిన వారికి అవార్డ్స్ అందజేశారు. బెస్ట్ ఫైర్ స్టేషన్ గా కరీంనగర్ డివిజన్ ,సెకండ్ నల్గొండ , థర్డ్ గౌలి గూడ స్టేషన్స్ కు అవార్డ్స్ దక్కాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అగ్ని ప్రమాదాల నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు భయాందోళనకు గురి కాకుండా... అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందిచాలని కోరారు. అగ్ని ప్రమాదాలు సంభవించిన వెంటనే ఫైర్ డిపార్ట్మెంట్ కు సమాచారం ఇవ్వడం ద్వారా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూసుకోవచ్చన్నారు. విద్యా సంస్థలు, ఫ్యాక్టరీలు, ఆసుపత్రులు తదితర వాటిల్లో కచ్చితంగా అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, రవి గుప్తా , ఫైర్ డిపార్ట్ మెంట్ డైరెక్టర్ జనరల్సంజయ్ కుమార్ జైన్, ఫైర్  ఆఫీసర్స్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తల కోసం...

ఆఫీసులకు వచ్చేందుకు ఐటీ ఉద్యోగులు ఆసక్తి చూపట్లే

ప్రైవేటు ల్యాబ్​లతో ఎంజీఎం సిబ్బంది కుమ్మక్కు

టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌లో ఫినిషర్‌‌‌‌‌‌‌‌గా కార్తీక్‌‌‌‌‌‌‌‌ పనికొస్తాడు