
సమ్మర్ చంపేస్తుంది... ఓ పక్క ఉక్కపోత.. మరోపక్ర చెమట కంపు.. వీటితో జనాల ఇబ్బంది అంతా ఇంతా కాదు. మంచి స్మెల్ వచ్చే సోప్ తో గంటల తరబడి స్నానం చేసినా.. సువాసన వెదజల్లే పెర్ఫ్యూమ్స్ వాడినా ఆ రెండు నిమిషాలే.. మళ్లీ భరించలేని చెమట కంపుతో జనాలు ఇబ్బంది పడతారు. అలాంటి వారు కొన్ని పద్దతులను ఉంచి బ్యాడ్ స్మెల్‌ను తొలగించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. . .
ఎండాకాలంలో జనాలు చిరాకు చిరాగ్గా ఉంటారు. అసలే వేడి.. చెమట కంపుతో జనాలు పడే ఇబ్బంది అంతా ఇంతాకాదు. రోజు రెండు సార్లుచేసినా.. రెండు గంటలకు ఒకసారి శరీరాన్ని చల్లటి నీళ్లుతో తుడుచుకున్నా చెమటకంపుమాత్రం వదలదు. ఎంత మంచి వాసన వచ్చే సోపు వాడినా.. మార్కెట్లోకి కొత్తగా వచ్చే సువాసన ఇచ్చే పెర్ ఫ్యూమ్స్ వాడినా చెమట కంపు.. కంపే.. ఇలా ఇబ్బంది పడే వారు చెమట వాసన నుంచి బయటపడవచ్చని నిపుణలు అంటున్నారు.
స్నానం చేయడం: ఎండాకాలంలో స్నానం చేయకుండా బయటకు రాలేం. ఇంటికి వెళ్లిన తరువాత స్నానం చేయకుండా ఉండలేం. ఇలా రోజుకు రెండు సార్లు రెండేసి బక్కెట్ల చొప్పున చల్లటి నీళ్లతో సబ్బుతో స్నానం చేయండి. కొన్ని బ్యాక్టీరియాలు శరీరానికి అతుక్కొని అలానే ఉంటాయి. అవి మళ్లీ చెమటను పుట్టిస్తాయి. అందుకని ప్లాస్టిక్ స్క్రబ్బర్‌కు సోప్ పెట్టి దానితో సున్నితంగా రుద్దుకుంటూ స్నానం చేయాలి. ఇలా చేయడం శరీరంపై బ్యాక్టీరియా తొలగి ఉల్లాసంగా ఉంటారు. ఆ తరువాత మెత్తటి క్లాత్ ను ఉపయోగించి శరీరాన్ని తుడుచుకోవాలి. ఆరిన తరువాత.. పౌడర్ రాసుకుంటే మంచిది.
Also Read : తరుచుగా అలసట,బలహీనతతో బాధపడుతున్నారా?
యాంటీ బాక్టీరియల్ సోప్: స్నానం చేసినా చాలామంది చెమట వాసనతో ఇబ్బంది పడతారు. శరీరంపై బ్యాక్టీరియా పేరుకు పోయి దుర్గంధం కలుగుతుంది. అలాంటి వారు యాంటీ బ్యాక్టీరియల్ సోప్ ను ఉపయోగించాలి. ఈ సోప్ ను వాడడం వలన చెమట వాసనను తొలగించుకోవచ్చు.
కాటన్ దుస్తులు: ఎండాకాలంలో మెత్తగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి. ఇవి త్వరగా చెమటను పీల్చుకుంటాయి. అంతే కాకుండా చర్మానికి గాలి తగిలేలా ఈ దుస్తులు ఉండటం వలన చెమట ఆరిపోతుంది.
నిమ్మరసం : స్నానం చేసేటప్పుడు శరీరానికి నిమ్మరసం పెట్టుకోవడం వల్ల చెమట వాసన తగ్గుతుంది. ఇందులో ఉండే సిట్రిక్ యాసిడ్ చెమట వాసనను తగ్గిస్తుంది. బ్యాక్టీరియా ఎక్కువుగా క్లోజ్‌గా ఉండేప్రదేశాల్లో ( చంకల లాంటి ప్రదేశాల్లో) వృద్ది చెందుతుంది. కాబట్టి అలాంటి ప్రదేశాల్లో నిమ్మకాయ చెక్కను రుద్ది ఆరిన తరువాత స్నానం చేయండి.
బేకింగ్ సోడా : బేకింగ్ సోడా చెమట వాసనను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. బేకింగ్ షోడాను నీటిలో కలిపి ద్రావకం తయారు చేసుకోండి. ఈ నీటిలో కాటన్ క్లాత్ ను ముంచి చెమట పట్టే ప్రాంతంలో క్లీన్ చేయండి. ఇలా చేయడం వల్ల చెమట వాసన రాకుండా ఉంటుంది