Good Food : ఈ ఆకుకూరల చట్నీలు.. రోజూ తింటే నొప్పులు మాయం.. చెడు కొలస్ట్రాల్ ను ఇట్టే తగ్గిస్తుంది..!

Good Food : ఈ ఆకుకూరల చట్నీలు.. రోజూ తింటే నొప్పులు మాయం.. చెడు కొలస్ట్రాల్ ను ఇట్టే తగ్గిస్తుంది..!

కంప్యూటర్​ యుగం నడుస్తుంది. జనాలు పొద్దున్నే లేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునేంత వరకు బిజీ లైఫ్​ ను గడుపుతున్నారు.  క్రమం తప్పి ఆహారం తీసుకోవడంతో అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. కంప్యూటర్​ ముందు గంటల తరబడి కూర్చోవడంతో..యూరిక్​ యాసిడ్​ పెరగడం.. కీళ్లలో వాపు... జాయింట్​ పెయిన్స్​ ఇలా అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అయితే  కొన్ని ఆకుల చట్నీ (చట్నీ ఫర్ యూరిక్ యాసిడ్ కంట్రోల్) ఈ సమస్యను నివారిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. 

మనం తినే ఆకు కూరల్లో  యాంటీఆక్సిడెంట్ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి.  ఇవి శరీరానికి కావలసిన ప్రోటీన్లు అందిస్తాయి.  కొన్ని ఆకుల చట్నీని  క్రమం తప్పకుండా  తినడం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయిలు తగ్గుతాయి.  ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. 

Also Read :- ఫేవరేట్ స్నాక్ ఐటెం..గుర్తుంచుకుందాం ఇలా..

ఆయుర్వేదం ప్రకారం.. అనేక మొక్కల ఆకులు  యూరిక్ యాసిడ్‌ను తగ్గిస్తాయి. ఈ మొక్కల ఆకులతో చేసిన చట్నీ టేస్ట్​ అదర్స్​.. అంతేకాదు..  శరీరంలో పేరుకుపోయిన  యూరిక్ యాసిడ్ ను తగ్గిస్తాయి.   ఈ చట్నీలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మరియు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు  మంటను తగ్గించడంలో ..  యూరిక్ యాసిడ్ స్ఫటికాలను కరిగించడంలో ఎంతో ఉపయోగపడతాయి.   

  • కొత్తిమీర ఆకులు: కొత్తిమీరలో యాంటీఆక్సిడెంట్లు ..  విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి.  ఇది యూరిక్ యాసిడ్ తగ్గించడంలో సహాయపడుతుంది.
  • పుదీనా ఆకులు: పుదీనాలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి.  ఇవి కీళ్ల నొప్పులు ..  వాపులను తగ్గిస్తాయి
  • తులసి ఆకులు: తులసిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.   ఇవి యూరిక్ యాసిడ్ స్థాయిలను నియంత్రిస్తాయి. 
  • వేప ఆకులు: వేప ఆకులు యూరిక్ యాసిడ్ స్ఫటికాలను విచ్ఛిన్నం చేస్తాయి.  శరీరంలో పేరుకుపోయిన క్రిములను నాశనం చేస్తాయి

చట్నీ చేసే విధానం:  చట్నీ చేయాలనుకున్న ఆకులను శుభ్రంగా కడిగి సన్నగా కోయాలి.  పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లిని సన్నగా తరగాలి. అన్ని పదార్థాలను మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. దానికి నిమ్మరసం, ఉప్పు కలిపి మెత్తని చట్నీలా తయారు చేసుకోవాలి.