హైదరాబాద్​లో ఇండ్ల అమ్మకాల జోరు

హైదరాబాద్​లో ఇండ్ల అమ్మకాల జోరు

హైదరాబాద్, వెలుగు: రియల్టీ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని అన్ని ప్రాంతాల్లోనూ దూసుకెళ్తోందని ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాపర్టీ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఇండియా వెల్లడించింది. కరోనా ఎఫెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉన్నప్పటికీ, ఇండ్లు వేగంగా అమ్ముడుపోతున్నాయని తెలిపింది. ఈ మేరకు ఈ కంపెనీ గురువారం  ‘‘ఇండియా రియల్ ఎస్టేట్ జనవరి–- జూన్ 2021’’ పేరుతో విడుదల చేసిన రిపోర్టు ప్రకారం.. సిటీలో కొత్త ఇండ్ల అమ్మకాలు ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో (హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌1) 150 శాతం(ఏడాది ప్రాతిపదికన) పెరిగి 11,974 యూనిట్లకు చేరుకున్నాయి. గత ఏడాది ఇదే కాలంలో 4,782 యూనిట్లతో పోలిస్తే అమ్మకాలు రెట్టింపు కంటే ఎక్కువ. కొత్త ప్రాజెక్టుల సంఖ్య కూడా తక్కువగా ఏమీ లేదు.  ఇదేకాలంలో ప్రాజెక్టుల లాంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు 278 శాతం పెరిగాయి. ఈ ఏడాది హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌1లో 16,712 యూనిట్లు అందుబాటులోకి రాగా, 2020 మొదటి ఆరు నెలల్లో 4,422 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఇన్వెంటరీ (అమ్ముడుపోని ఇండ్లు/ఆస్తులు)  గత ఏడాది 11,918 యూనిట్లు ఉండగా, ఈసారి హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌1లో వీటి సంఖ్య 4,037 యూనిట్లకు పడిపోయింది. ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల్లో అన్ని ప్రైస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెగ్మెంట్లకూ గిరాకీ పెరిగింది. రూ .25 లక్షల నుండి 50 లక్షల కేటగిరీలో 240 శాతం పెరుగుదల కనిపించింది. రూ. కోటి నుంచి రూ.రెండు కోట్ల కేటగిరీ ప్రాపర్టీల అమ్మకాలు గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌1లో 158 శాతం పెరిగాయి.

వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మస్తు డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 
కొత్త రియల్టీ ప్రాజెక్టుల్లో ఎక్కువగా సిటీ పశ్చిమ దిక్కున (కూకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, కోకాపేట)  వచ్చాయి.  ఉత్తర ప్రాంత చిన్న మార్కెట్లలోనూ అమ్మకాలు, లాంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు పెరిగాయి. వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫ్రం హోమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విధానం పెరగడంతో పెద్ద ఇండ్లకు డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎక్కువయింది.   రూ. ఒక కోటి నుండి 2 కోట్ల టికెట్ సైజు కేటగిరీ ఇండ్లు గత ఏడాది హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌1లో 18శాతం పెరిగి1,544 యూనిట్లకు చేరాయి.  ఈ ఏడాది మొదటి ఆర్నెళ్లలో  27 శాతం పెరిగి 4,444 ఇండ్లు అమ్ముడయ్యాయి.  ధరలు దాదాపు 1 శాతం పెరిగాయి ఈ సందర్భంగా నైట్ ఫ్రాంక్ ఇండియా హైదరాబాద్ బ్రాంచ్ డైరెక్టర్ శామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్థర్ మాట్లాడుతూ “ఏ కొలమానాన్ని బట్టి చూసినా హైదరాబాద్ హౌసింగ్ మార్కెట్ బాగా ఎదిగింది. ఈ సిటీకి కీలకమైన ఐటీ కంపెనీల బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాగా పెరుగుతోంది. కస్టమర్లకు, ఇన్వెస్టర్లకు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కచ్చితంగా ఆకర్షణీయమైన సిటీ. ఇక్కడ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్రాను మెరుగుపర్చడానికి తెలంగాణ ప్రభుత్వం తన వంతు సహకరిస్తోంది”అని అన్నారు.