ఏప్రిల్‌‌ 4 నుంచి ఆహాలో హోం టౌన్‌‌

ఏప్రిల్‌‌ 4 నుంచి ఆహాలో హోం టౌన్‌‌

రాజీవ్ కనకాల, ఝాన్సీ, ప్రజ్వల్ యాద్మ, సాయిరామ్, అనీ, అనిరుధ్, జ్యోతి ముఖ్యపాత్రల్లో శ్రీకాంత్ రెడ్డి పల్లే తెరకెక్కించిన వెబ్ సిరీస్‌‌ ‘హోం టౌన్‌‌’.  నవీన్ మేడారం, శేఖర్ మేడారం నిర్మించారు. ఏప్రిల్‌‌ 4 నుంచి ఆహా ఓటీటీలో ఇది స్ట్రీమింగ్ కానుంది. మంగళవారం ట్రైలర్‌‌‌‌ను విడుదల చేశారు. 

హీరో విజయ్ దేవరకొండ ఈ ట్రైలర్‌‌‌‌ను లాంచ్‌‌ చేసి, టీమ్‌‌కు బెస్ట్ విషెస్‌‌ చెప్పాడు. ఊర్లో ఫొటో స్టూడియో నడుపుకునే ప్రసాద్ (రాజీవ్ కనకాల) తన కొడుకు శ్రీకాంత్‌‌ (ప్రజ్వల్ యాద్మ)ను ఉన్నత చదువుల కోసం విదేశాలకు పంపి, గొప్ప స్థాయిలో చూడాలనుకుంటాడు. 

కానీ తన ఇద్దరు ఫ్రెండ్స్‌‌తో సరదా జీవితానికి అలవాటుపడ్డ శ్రీకాంత్‌‌ చదువుపై శ్రద్ధ పెట్టడు. ఈ క్రమంలో ఆ కుటుంబ సభ్యుల మధ్య ఓ సంఘర్షణ. హోం టౌన్‌‌ను వదిలి అతను విదేశాలకు వెళ్లాడా, అందుకోసం మిడిల్‌‌ క్లాస్‌‌ తండ్రి ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు అనేది మిగతా కథ. ‘నైంటీస్‌‌ ఎ మిడిల్‌‌ క్లాస్‌‌ బయోపిక్‌‌’ తరహాలో ఓ చిన్న కుటుంబం నేపథ్యంలో సాగే ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌గా దీన్ని తెరకెక్కించినట్టు ట్రైలర్‌‌‌‌ను చూస్తే అర్థమవుతోంది.  సురేష్ బొబ్బిలి దీనికి సంగీతాన్ని అందించాడు.