జగిత్యాల జిల్లాలో ప్రారంభమైన హోమ్ ఓటింగ్

జగిత్యాల జిల్లాలో హోమ్ ఓటింగ్ ప్రారంభమైంది. అర్హులైన వృద్ధులు, వికలాంగులు హోమ్ ఓటింగ్ లో పాల్గొంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 1,02 లక్షల వృద్ధుల ఓట్లు ఉండగా.. ఇంటి ఇంటివద్ద నుంచి ఓటు హక్కు వినియోగించుకునే వృద్ధులు 1141 మంది ఉన్నారు.

జిల్లా వ్యాప్తంగా ఈరోజు, రేపు(నవంబర్ 24, 25) వికలాంగ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారని అధికారులు తెలిపారు. ఎన్నికల అధికారులు వృద్ధులు, వికలాంగుల ఇండ్లకు చేరుకొని.. హోమ్ ఓటింగ్ ప్రక్రియను జరిపిస్తున్నారు. ఇందులో భాగంగా  ప్రత్యేకంగా వృద్ధుల ఓట్లు వేయించేలా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.

ALSO READ : Kota Bommali PS Twitter Review: థ్రిల్లింగ్ కాన్సెప్ట్‏తో కోటబొమ్మాళి పీఎస్.. ఆడియన్స్ టాక్ ఎలా ఉందంటే?