తెలంగాణలో నవంబర్ 25తో ముగియనున్న హోం ఓటింగ్‌‌‌‌‌‌‌‌

జనగామ, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్​సీహెచ్‌‌‌‌‌‌‌‌ శివలింగయ్య చెప్పారు. డీసీపీ సీతారాంతో కలిసి బుధవారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లోని మీడియా సెంటర్‌‌‌‌‌‌‌‌లో కలెక్టర్‌‌‌‌‌‌‌‌ మాట్లాడారు. ఈ నెల 21న మొదలైన హోం ఓటింగ్‌‌‌‌‌‌‌‌ ప్రక్రియ 25తో ముగుస్తుందన్నారు. జిల్లాలో 814 మంది సీనియర్‌‌‌‌‌‌‌‌ సిజిజన్స్‌‌‌‌‌‌‌‌, 662 మంది దివ్యాంగులకు హోం ఓటింగ్‌‌‌‌‌‌‌‌ అవకాశం కల్పించినట్లు చెప్పారు. 21వ తేదీన ఒక్క రోజే 188 మంది ఓటు వేశారని చెప్పారు.

హోం ఓటింగ్‌‌‌‌‌‌‌‌ కోసం అప్లై చేసుకున్న వారికి పోలింగ్‌‌‌‌‌‌‌‌ కేంద్రంలో ఓటు వేసే అవకాశం ఉండదని, వారు ఇండ్ల వద్దే అందుబాటులో ఉండాలని సూచించారు. ఓటర్‌‌‌‌‌‌‌‌ స్లిప్‌‌‌‌‌‌‌‌ల పంపిణీ పూర్తి కావొచ్చిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్‌‌‌‌‌‌‌‌ ఓటు వేసేందుకు ఈ నెల 25 వరకు గడువు ఉందన్నారు. పెంబర్తిలోని విద్యాభారతి ఇన్స్‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ టెక్నాలజీలో కౌంటింగ్‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో నోడల్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ దామోదర్‌‌‌‌‌‌‌‌రావు, కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌ ఏవో రవీందర్, డీపీఆర్‌‌‌‌‌‌‌‌వో పసునూరి రాజేంద్రప్రసాద్‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.

ములుగు నియోజకవర్గంలో  152 మంది హోం ఓటింగ్‌‌‌‌‌‌‌‌

ములుగు, వెలుగు : ములుగు నియోజకవర్గంలో 152 మందికి హోం ఓటింగ్‌‌‌‌‌‌‌‌ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌‌‌‌‌‌‌‌ ఇలా త్రిపాఠి చెప్పారు. బ్యాలెట్‌‌‌‌‌‌‌‌ పేపర్లతో ప్రిసైడింగ్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌, అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌ ప్రిసైడింగ్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌, పోలీసులు వెళ్లి ఓటర్లతో ఓటు వేయిస్తున్నారని చెప్పారు. ఓటింగ్‌‌‌‌‌‌‌‌ ప్రక్రియ మొత్తాన్ని రికార్డింగ్‌‌‌‌‌‌‌‌గ్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నామన్నారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు 84 మంది హోం ఓటింగ్‌‌‌‌‌‌‌‌ పూర్తైందని చెప్పారు. రెండో విడత కింద 23, 24, 25 తేదీల్లో మరో ఛాన్స్‌‌‌‌‌‌‌‌ ఇస్తున్నట్లు చెప్పారు. ఫారం డి ద్వారా అప్లై చేసుకున్న 2,072 మంది ఈ నెల 27 నుంచి 29 వరకు ప్రభుత్వ జూనియర్‌‌‌‌‌‌‌‌ కాలేజీలో ఏర్పాటు చేస్తున్న కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకోవచ్చని చెప్పారు.