ఐఎస్​ఎస్​కు దీటుగా స్వదేశీ స్పేస్​ స్టేషన్​

ఐఎస్​ఎస్​కు దీటుగా స్వదేశీ స్పేస్​ స్టేషన్​

అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధక కేంద్రానికి పోటీగా ఇండియా భారతీయ అంతరిక్ష స్టేషన్​ (బీఏఎస్​) పేరిట ఇస్రో ఓ స్పేస్​స్టేషన్​ను 2035 వరకు నిర్మించాలనుకుంటున్నది. ఇలాంటి సమయంలో బెంగళూరుకు చెందిన ఆకాశలబ్ధి అనే స్టార్టప్​ కంపెనీ అంతరిక్షంలో వ్యోమగాములు పరిశోధనలు చేసుకోవడానికి, రోదసి యాత్రికులు సేద తీరడానికి  ఎక్స్​ఎస్​హెచ్​ పేరిట స్పేస్​ స్టేషన్​ను నిర్మించనున్నది. 

 

ALSO READ : సుస్థిరాభివృద్ధి లక్ష్య సూచీ 2023–24లో తెలంగాణ స్థానం ఎంత?

  •     ఎలాన్​ మస్క్​కు చెందిన స్పేస్​ఎక్స్​ భాగస్వామ్యంతో 2027 వరకు ఈ స్పేస్​ స్టేషన్​ను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు కంపెనీ తెలిపింది. 
  •     ఈ స్పేస్​ స్టేషన్​లో ఏకకాలంలో 6 నుంచి 16 మంది ఉండవచ్చు, అంతరిక్షంలోని గ్రహ శకలాలు, రేడియేషన్​ నుంచి రక్షించే అన్నిరకాల ఏర్పాట్లు ఐఎస్​ఎస్​కు దీటుగా తమ స్పేస్​ స్టేషన్​లో ఉంటాయి. ఐఎస్​ఎస్​తో పోలిస్తే ఈ స్టేషన్​ ఎంతో చవకైంది. 
  •     2023 నవంబర్​లోనే ఇందుకు సంబంధించిన ప్రొటోటైప్​ అంతరిక్ష హబ్​ డిజైన్​ను ఐఐటీ రూర్కీ, ఐఐఎస్​ బెంగళూరులో సిద్ధం చేసింది.