
కాగ జ్ నగర్, వెలుగు: కాగజ్ నగర్ టౌన్ పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న అల్లూరి పోశం అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం చనిపోయాడు. చింతలమానేపల్లి మండలం బాబాసాగర్ ఇంట్లో పోశం మృతదేహానికి కాగజ్ నగర్ డీఎస్పీ కరుణాకర్, కాగజ్ నగర్ టౌన్ సీఐ బుద్దే స్వామి, రిజర్వ్ ఇన్స్పెక్టర్(హోంగార్డ్స్) కిరణ్ కుమార్ నివాళులర్పించారు. అంతక్రియల కోసం రూ. 20 వేలు అందించారు. కౌటల సీఐ సాదిక్ పాషా సొంతంగా రూ.10 వేలు సాయం చేశారు.